మలేసియాకు వెళ్లే భారతీయ ప్రయాణికులు వీసా రహిత ప్రవేశ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కౌలాలంపూర్‌లోని భారత హైకమిషన్ సూచించింది. 30 రోజుల వీసా ఫ్రీ సదుపాయాన్ని కేవలం పర్యాటకం, సామాజిక సందర్శనలకే వినియోగించాలని స్పష్టం చేసింది. ఉద్యోగం కోసం ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవడం మలేసియా వలస నిబంధనలకు విరుద్ధమని తెలిపింది.
మలేసియాలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు ఏజెంట్లు నకిలీ ఆఫర్లతో భారతీయులను ఆకర్షిస్తున్నట్లు హైకమిషన్ హెచ్చరించింది. ఇలాంటి ఆఫర్లను నమ్మి దేశంలోకి వచ్చిన వారు మోసపోవడంతో పాటు, వీసా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొంది.
వీసా ఫ్రీ లేదా టూరిస్ట్ హోదాలో మలేసియాకు వెళ్లే వారు అక్కడ అనుమతించిన గడువుకు మించి ఉండకూడదని సూచించింది. ఉద్యోగం చేయాలనుకునే వారు ముందుగానే సంబంధిత వర్క్ పర్మిట్, అవసరమైన అనుమతులు పొందిన తర్వాతే ప్రయాణించాలని స్పష్టం చేసింది.
అదేవిధంగా సాధారణ ప్రయాణికులు మలేసియాకు వెళ్లే సమయంలో రిటర్న్ టికెట్, హోటల్ బుకింగ్, ప్రయాణ ప్రణాళిక వంటి వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని హైకమిషన్ సూచించింది. ఇమిగ్రేషన్ అధికారులు అడిగినప్పుడు అవసరమైన పత్రాలను చూపించగలిగేలా చూసుకోవాలని తెలిపింది.
ప్రయాణానికి ముందు పాస్‌పోర్ట్ కనీసం ఆరు నెలలు చెల్లుబాటులో ఉందో లేదో పరిశీలించుకోవాలని సూచించింది. మలేసియా అందిస్తున్న ఈ వీసా రహిత ప్రవేశ సదుపాయం ఈ ఏడాది చివరి వరకు భారత పౌరులకు అందుబాటులో ఉన్న నేపథ్యంలో హైకమిషన్ ఈ సూచనలు చేసింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















