పశ్చిమాసియాలో విధుల్లో ఉన్న అమెరికా సైనికుల పరిస్థితిపై ఆందోళన కలిగించే కథనాలు వెలువడుతున్నాయి. అమెరికా నౌకాదళానికి చెందిన సిబ్బంది కొందరు తగినంత ఆహారం అందడం లేదని కుటుంబ సభ్యులతో పంచుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలుచటి చపాతీలు, కొద్దిపాటి కూరగాయలు, స్వల్ప మాంసంతో కూడిన ఆహారం మాత్రమే అందుతోందని సమాచారం.
ఇరాన్తో ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత వేలమంది సైనికులను పశ్చిమాసియాకు తరలించారు. ఈ నేపథ్యంలో USS Tripoli, USS Abraham Lincoln వంటి యుద్ధనౌకలు హర్మూజ్ ప్రాంతంలో మోహరించాయి. కొన్ని వారాలుగా సముద్రంలోనే విధులు నిర్వహిస్తున్న సైనికులకు సరఫరాలు తగ్గిపోవడం వల్ల రేషన్ విధానంలో ఆహారం పంపిణీ చేస్తున్నట్లు సమాచారం.
విదేశాల్లో ఉన్న సైనికులకు కుటుంబాలు పంపే పోస్టల్ సేవలు నిలిచిపోవడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. రవాణా అంతరాయాలు, గగనతల పరిమితులు కారణంగా ఏప్రిల్ నుంచి సరఫరాలు సక్రమంగా చేరడం లేదని అధికారులు తెలిపారు. దీంతో సైనికులు తమ వద్ద ఉన్న ఆహారాన్ని పరస్పరం పంచుకుంటూ రోజులు గడుపుతున్నట్లు తెలుస్తోంది.
ఇక USS Gerald R. Fordలో ఇటీవల అగ్ని ప్రమాదం సంభవించడం, మరుగుదొడ్లు పనిచేయకపోవడం వంటి సమస్యలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ నౌకలో విధుల్లో ఉన్న వేలాది సిబ్బంది అసౌకర్యాలను ఎదుర్కొంటున్నట్లు కథనాలు చెబుతున్నాయి.యుద్ధ మధ్యలో ఆహార సంక్షోభం.. అమెరికా సైనికుల కష్టాలు వెలుగులోకి
మొత్తంగా, హర్మూజ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య అమెరికా సైనికులు ఆహారం, సరఫరాలు,వసతుల కొరతతో ఇబ్బందులు పడుతున్నారన్న వార్తలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















