దేశవ్యాప్తంగా వంటగ్యాస్ కొరత ప్రభావం ఇప్పుడు రైల్వే కేటరింగ్ సేవలపైనా పడుతోంది. కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరా తగ్గడంతో హోటళ్లు, రెస్టారెంట్లతో పాటు రైల్వే స్టేషన్లలోని ఆహార సేవల నిర్వహణ కూడా సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ( వెండర్లకు కీలక సూచనలు జారీ చేసింది.
రైల్వే స్టేషన్లలో పనిచేస్తున్న ఫుడ్ ప్లాజాలు, రిఫ్రెష్‌మెంట్ రూములు, జనాహార్ కేంద్రాలకు మార్చి 10న ప్రత్యేక అడ్వైజరీ ఇచ్చింది. ఎల్‌పీజీ కొరత కారణంగా వంట ప్రక్రియలు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ వంట పద్ధతులను ఉపయోగించాలని సూచించింది. అవసరమైన చోట మైక్రోవేవ్‌లు, ఇండక్షన్ స్టవ్‌లు వంటి విద్యుత్ ఆధారిత పరికరాలను వినియోగించాలని పేర్కొంది.
అదేవిధంగా ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రెడీ-టు-ఈట్ ఫుడ్ ఐటమ్స్ తగినంతగా నిల్వ ఉంచాలని వెండర్లను కోరింది. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఆహార సరఫరా కొనసాగించాలని సూచించింది.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల ఎల్‌పీజీ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని చమురు సంస్థలకు సూచించడంతో కమర్షియల్ సిలిండర్లకు కొరత పెరిగింది.
దీని ప్రభావంగా పలు నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొన్నిచోట్ల హాస్టళ్లు, మెస్‌లు తమ మెనూలను తగ్గించగా, మరికొన్ని ప్రాంతాల్లో గ్యాస్‌కు బదులుగా కట్టెల పొయ్యిలు, బొగ్గు కుంపట్లు వినియోగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో రైల్వే ప్రయాణికులకు ఆహార సేవలు అంతరాయం లేకుండా కొనసాగించేందుకు ఐఆర్‌సీటీసీ తీసుకున్న ఈ చర్యలు కీలకంగా మారాయి.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews Chandrababu naidu ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government HealthyLifestyle India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews SportsNews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNow WorldNews



















