పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అంతర్జాతీయ విమాన రవాణాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భారత్ నుంచి ఆ ప్రాంతాలకు నడిచే విమాన సర్వీసులను దేశీయ విమానయాన సంస్థలు పెద్దఎత్తున రద్దు చేస్తున్నాయి.
యుద్ధ పరిస్థితులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 10 వేలకుపైగా విమాన సర్వీసులు రద్దు అయినట్లు పౌరవిమానయాన శాఖ వెల్లడించింది. సాధారణంగా రోజుకు 300 నుంచి 350 వరకు విమానాలు నడుస్తుండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 80 నుంచి 90కి పడిపోయినట్లు తెలిపింది.
మరోవైపు సుదూర ప్రయాణాల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు డీజీసీఏ పైలట్ల ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్‌ను తాత్కాలికంగా సడలించింది. విమాన కార్యకలాపాలు నిరంతరాయంగా కొనసాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.ఈ పరిణామాలు అంతర్జాతీయ ప్రయాణికులపై ప్రభావం చూపే అవకాశం ఉండగా, పరిస్థితులు సాధారణ స్థితికి చేరేవరకు జాగ్రత్తలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















