పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇజ్రాయెల్–అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ముడి చమురు సరఫరాకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా ఎగసిపడుతున్నాయి. తాజాగా ఒక బ్యారెల్ ముడిచమురు ధర 100 డాలర్ల మార్క్‌ను దాటింది. దాదాపు మూడున్నరేళ్ల తర్వాత చమురు ధరలు ఈ స్థాయికి చేరడం గమనార్హం.
వేగంగా పెరిగిన చమురు ధరలు
అమెరికా చమురు ధరలకు బెంచ్‌మార్క్‌గా భావించే వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) ధర బ్యారెల్‌కు 106.22 డాలర్లకు చేరింది. శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి ఇది 90.90 డాలర్లుగా ఉండగా.. తాజాగా దాదాపు 16.9 శాతం పెరిగింది. అదే సమయంలో బ్రెంట్ క్రూడ్ ధర కూడా భారీగా పెరిగి బ్యారెల్‌కు 107.97 డాలర్లకు చేరింది. గత వారం నుంచే ధరలు పెరుగుదల దిశగా సాగుతుండగా, అమెరికా క్రూడ్ ధరలు సుమారు 36 శాతం, బ్రెంట్ క్రూడ్ ధరలు 26 శాతం పెరిగినట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
హర్మూజ్ జలసంధి ప్రభావం
ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఇజ్రాయెల్–అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణలు రెండో వారంలోకి ప్రవేశించాయి. ఈ ఉద్రిక్తతల కారణంగా పశ్చిమాసియాలో చమురు ఉత్పత్తి, రవాణా వ్యవస్థలపై ప్రభావం పడుతోంది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి పరిస్థితి ప్రపంచ మార్కెట్లను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ జలసంధిని మూసివేస్తామని, నౌకలు దానిని దాటేందుకు ప్రయత్నిస్తే దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరించింది.
హర్మూజ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాకు కీలక మార్గం. ప్రపంచవ్యాప్తంగా వినియోగించే ముడిచమురులో దాదాపు ఐదో వంతు ఈ మార్గం ద్వారానే రవాణా అవుతుంది. దీంతో ఈ మార్గంలో అంతరాయం ఏర్పడితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ధరల పెరుగుదల తాత్కాలికమే: ట్రంప్
చమురు ధరలు 100 డాలర్ల మార్క్ దాటడంతో అంతర్జాతీయ మార్కెట్లు ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్ అణు ముప్పును తగ్గించేందుకు చెల్లిస్తున్న చిన్న మూల్యమే ఈ ధరల పెరుగుదల అని వ్యాఖ్యానించారు. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత చమురు ధరలు మళ్లీ పడిపోతాయని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్నందున ప్రపంచ ఇంధన మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితులు ఎలా మారతాయన్న దానిపై పెట్టుబడిదారులు, దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu Chandrababu naidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government HealthyLifestyle India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews SportsNews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNow WorldNews

















