బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో లోపాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే ఖాతాదారులకు త్వరితగతిన పరిష్కారం అందించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త రిజర్వ్ బ్యాంక్ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ (RBI-Integrated Ombudsman Scheme)-2026ను తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా అర్హత ఉన్న వినియోగదారులు ఎలాంటి రుసుము చెల్లించకుండా ఫిర్యాదు చేయవచ్చు.
ఈ పథకంలో అంబుడ్స్‌మన్ పరిధిలోకి వచ్చే వివాదం విలువపై ప్రత్యేక గరిష్ఠ పరిమితి లేదని ఆర్బీఐ మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి. అయితే సేవా లోపం కారణంగా ఖాతాదారుడికి జరిగిన ఆర్థిక నష్టానికి రూ.30 లక్షల వరకు పరిహారం లభించే అవకాశం ఉంది.
దీనితో పాటు ఫిర్యాదుదారుడి విలువైన సమయం వృథా కావడం, ఎదురైన మానసిక క్షోభ, ఇబ్బందులకు గాను అదనంగా రూ.3 లక్షల వరకు పరిహారం ఇవ్వవచ్చు. అంటే అర్హత ఉన్న కేసుల్లో మొత్తం పరిహారం రూ.33 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.
ఏయే సంస్థలకు వర్తిస్తుంది?
ఈ అంబుడ్స్‌మన్ వ్యవస్థ పరిధిలో పలు ప్రధాన నియంత్రిత ఆర్థిక సంస్థలు వస్తాయి.
- ప్రభుత్వ, ప్రైవేటు రంగ వాణిజ్య బ్యాంకులు
- పథకం పరిధిలోకి వచ్చే ఎంపిక చేసిన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు
- క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు, అంటే క్రెడిట్ బ్యూరోలు
- ఆర్బీఐ నియంత్రణలో ఉండి, ఈ పథకం కింద నోటిఫై చేసిన ఇతర నియంత్రిత సంస్థలు
ఫిర్యాదు ఎలా చేయాలి?
అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించే సమయంలో ఖాతాదారులు తమ సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆధారాలను సమర్పించాలి. ముఖ్యంగా:
- పేరు, మొబైల్ నంబర్, పోస్టల్ చిరునామా, ఇ-మెయిల్ వివరాలు
- ఫిర్యాదు చేస్తున్న బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ వివరాలు
- సంబంధిత సంస్థకు గతంలో చేసిన ఫిర్యాదు సంఖ్య లేదా రశీదు
- వివాదానికి సంబంధించిన బ్యాంకు లావాదేవీ వివరాలు
- సేవా లోపాన్ని నిరూపించే అవసరమైన పత్రాలు
- సమస్యకు సంబంధించిన సంక్షిప్త వివరణ
- తాము కోరుతున్న పరిష్కారం లేదా పరిహారం వివరాలు
ముందుగా బ్యాంకుకు ఫిర్యాదు తప్పనిసరి :
అయితే ఖాతాదారులు నేరుగా అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించలేరు. ముందుగా సంబంధిత బ్యాంకు లేదా ఆర్థిక సంస్థకు ఫిర్యాదు చేయాలి. సంస్థ నుంచి వచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోయినా, సమస్య పరిష్కారం కాకపోయినా.. అర్హత ఉన్న సందర్భాల్లో ఆర్బీఐ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చు.
అందువల్ల బ్యాంకు సేవల్లో లోపం ఎదురైనప్పుడు సంబంధిత సంస్థకు చేసిన ఫిర్యాదు వివరాలు, రశీదులు, లావాదేవీ ఆధారాలు వంటి పత్రాలను భద్రపరచుకోవడం ముఖ్యం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















