డిజిటల్ చెల్లింపులు, యూపీఐ లావాదేవీలు భారీగా పెరుగుతున్నప్పటికీ దేశంలో నగదు వినియోగం మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం భారత్‌లో 17,600 కోట్ల కరెన్సీ నోట్లు చెలామణిలో ఉన్నాయని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ శిరీష్ చంద్ర ముర్ము వెల్లడించారు.
జకార్తాలో జరిగిన బ్యాంక్ ఆఫ్ ఇండొనేషియా క్యాష్ మేనేజ్‌మెంట్ సదస్సులో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. సంఖ్యా పరంగా చూస్తే ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన కరెన్సీలైన అమెరికా డాలర్, యూరో కంటే భారత రూపాయి నోట్లే ఎక్కువగా చెలామణిలో ఉన్నాయని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా చెలామణిలో ఉన్న అమెరికా డాలర్ నోట్లు సుమారు 5,600 కోట్లు కాగా, భారత్‌లో చెలామణిలో ఉన్న నోట్ల సంఖ్య దానికి దాదాపు మూడు రెట్లు ఉంది. ఇక యూరో నోట్లు సుమారు 3,000 కోట్లు ఉండగా.. భారత కరెన్సీ నోట్ల సంఖ్య వాటి కంటే దాదాపు ఆరు రెట్లు అధికంగా ఉంది.
దేశంలో రూ.1, రూ.5, రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500 వంటి వివిధ విలువల నోట్లు లావాదేవీల్లో వినియోగిస్తున్నారు. ముఖ్యంగా తక్కువ విలువ కలిగిన నోట్లను రోజువారీ లావాదేవీల్లో అధికంగా ఉపయోగిస్తుండటంతో పెద్ద మొత్తంలో నగదు నోట్లు అవసరమవుతున్నాయి.
ఏటా 3,000 కోట్ల కొత్త నోట్లు :
దేశంలో నగదు అవసరాలను తీర్చేందుకు ఆర్‌బీఐ ప్రతి ఏడాది దాదాపు 3,000 కోట్ల కొత్త కరెన్సీ నోట్లను ముద్రిస్తోంది. అదే సమయంలో చిరిగిపోయిన, పాడైపోయిన, వినియోగానికి పనికిరాని దాదాపు 2,100 కోట్ల నోట్లను ఏటా చెలామణి నుంచి తొలగించి ధ్వంసం చేస్తున్నట్లు వెల్లడించింది.
డిజిటల్ చెల్లింపులు పెరిగినా నగదు వినియోగం తగ్గలేదు :
యూపీఐ, కార్డులు, ఇతర డిజిటల్ చెల్లింపు విధానాలు వేగంగా విస్తరిస్తున్నప్పటికీ భారత్‌లో నగదు చెలామణి మాత్రం రెండంకెల వృద్ధిని నమోదు చేస్తోందని ఆర్‌బీఐ పేర్కొంది. ముఖ్యంగా చిన్న మొత్తాల లావాదేవీల్లో నగదుపై ఆధారపడే పరిస్థితి కొనసాగుతోంది.
పాలిమర్ నోట్లపై దృష్టి :
కరెన్సీ నోట్ల ముద్రణ, రవాణా, నిల్వ, పాత నోట్లను మార్చడం వంటి ఖర్చులను తగ్గించేందుకు పాలిమర్ నోట్లను తీసుకొచ్చే అవకాశాలపై ఆర్‌బీఐ దృష్టి సారిస్తోంది. ఇవి సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే ఎక్కువకాలం మన్నికగా ఉండే అవకాశం ఉండటంతో నగదు నిర్వహణ ఖర్చులను తగ్గించేందుకు ఉపయోగపడతాయని భావిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















