భారత్ – యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదిరినట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ ఒప్పందాన్ని ప్రపంచవ్యాప్తంగా ‘అన్ని ఒప్పందాలకు తల్లి’గా (మదర్ ఆఫ్ ఆల్ డీల్స్) చర్చించుకుంటున్నారని తెలిపారు. మంగళవారం గోవాలో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్–2026 కార్యక్రమాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన సందర్భంగా ఈ ట్రేడ్ డీల్‌పై ఆయన మాట్లాడారు.
ఈ ఒప్పందం వల్ల భారత్, ఐరోపా దేశాల ప్రజలకు ఎన్నో మంచి అవకాశాలు లభిస్తాయని మోదీ చెప్పారు. ప్రపంచంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య మంచి సమన్వయానికి ఇది ఉదాహరణగా నిలుస్తుందన్నారు. ప్రపంచ జీడీపీలో భారత్, ఈయూ కలిపి 25 శాతం వాటా ఉందని, ప్రపంచ వాణిజ్యంలో దాదాపు మూడో వంతు ఈ రెండు ప్రాంతాలదేనని వివరించారు. ఈ ఒప్పందం వాణిజ్యాన్ని పెంచడమే కాకుండా ప్రజాస్వామ్యం, చట్టపాలనపై ఉన్న నిబద్ధతను మరింత బలపరుస్తుందని పేర్కొన్నారు.
ఈ ప్రకటన తర్వాత హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీ, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్ లెయన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇండియా–ఈయూ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు.
ఇండియా ఎనర్జీ వీక్‌లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 దేశాల నుంచి ప్రతినిధులు గోవాకు వచ్చారు. ఇంధన భద్రత, స్థిరమైన భవిష్యత్తుపై చర్చించేందుకు అందరూ భారత్‌కు వచ్చారని మోదీ అన్నారు. భారత్‌కు భారీ రిఫైనింగ్ సామర్థ్యం ఉందని, ఈ రంగంలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నామని, త్వరలోనే మొదటి స్థానానికి చేరుకుంటామని ఆయన వెల్లడించారు.
Amaravati Andhra pradesh Andhrapradesh APNews APPolitics Breaking news BreakingNews BusinessNews Chandrababu naidu ChandrababuNaidu Cricket CricketNews Crime News CrimeNews CrimeUpdate Devotion governance Government Heavy rains Hyderabad India IndiaNews LawAndOrder Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate news update PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews shiva sakthi news SportsNews Tdp Telangana TelanganaNews TeluguNews Toofan



















