కదులుతున్న కారులో నుంచి నెలల చిన్నారి అకస్మాత్తుగా జారిపడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. వెనుక నుంచి వస్తున్న మరో కారు డ్రైవర్ అప్రమత్తంగా స్పందించి వెంటనే వాహనాన్ని ఆపడంతో ప్రాణాంతక ప్రమాదం తప్పింది. కాలిఫోర్నియాలోని ఫులెర్టోన్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అందరినీ షాక్‌కు గురిచేస్తున్నాయి.
జనవరి 20న ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. చిన్నారి రోడ్డుపై పడిన వెంటనే అక్కడున్న ప్రయాణికులు, స్థానికులు స్పందించి సహాయం అందించారు. వెంటనే చిన్నారిని సురక్షితంగా పక్కకు తీసుకెళ్లి, అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. వైద్య పరీక్షల అనంతరం చిన్నారికి ఎలాంటి గాయాలు లేవని వైద్యులు స్పష్టం చేశారు.
ప్రమాద సమయంలో కారు తలుపు సరిగా మూయకపోవడం లేదా చిన్నారిని సరైన భద్రతా సీటులో ఉంచకపోవడమే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ నిర్లక్ష్యంపై చిన్నారి తల్లి జాక్వెలిన్ హెర్నాండెజ్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆమెపై పిల్లల భద్రతను నిర్లక్ష్యం చేసినట్టు ఆరోపణలు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై స్పందించిన పోలీసులు, చిన్న పిల్లలతో ప్రయాణించే సమయంలో భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలన్నారు. ప్రత్యేక కార్ సీట్లు, సీటుబెల్టులు ఉపయోగించడం తప్పనిసరి అని, చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుందని హెచ్చరించారు. ఈ సంఘటన తల్లిదండ్రులందరికీ గట్టి హెచ్చరికగా నిలుస్తోందని వారు పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews



















