అమరావతిలో దేశంలోనే తొలి అత్యంత సురక్షితమైన “క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్స్ టెస్ట్ బెడ్” ఏర్పాటు కానుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. టెలికమ్యూనికేషన్స్, సైబర్‌స్పేస్ రంగాల్లో కీలక పురోగతికి దారితీసే ఈ ప్రాజెక్ట్‌ను కేంద్ర ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ విభాగం సి-డాట్, అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఉమ్మడి భాగస్వామ్యంతో ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ టెస్ట్ బెడ్ ద్వారా క్వాంటమ్ కమ్యూనికేషన్ హార్డ్‌వేర్, ఫోటోనిక్, ఆప్టికల్ సిస్టమ్స్, ఎన్‌క్రిప్షన్ టెక్నాలజీలు, సురక్షిత నెట్‌వర్క్ మౌలిక సదుపాయాలు, అలాగే నెక్ట్స్ జనరేషన్ సైబర్ రక్షణ పరిశోధనలు, పరీక్షలకు పెద్ద ఊతం లభించనుందని ఆయన పేర్కొన్నారు.
టెలికమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, క్వాంటమ్ సైన్స్, ఐటీ రంగాలకు అమరావతిని కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ప్రపంచ టెలికమ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవం సందర్భంగా ఆయన ‘ఎక్స్’ వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు.
ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో ఈ టెస్ట్ బెడ్ ఏర్పాటులో భాగస్వాములవుతున్న సంస్థలు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, అధ్యాపకులు, ఆవిష్కర్తలు, విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా మేక్ ఇన్ ఇండియా సాంకేతికతకు, సురక్షిత డిజిటల్ మౌలిక సదుపాయాలకు అమరావతికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభిస్తుందని చెప్పారు.
ఫ్రాంటియర్ టెక్నాలజీస్, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్, డీప్ టెక్ ఆవిష్కరణలకు అమరావతి కీలక కేంద్రంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తు సాంకేతికత రూపకల్పనలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు, పరిశోధకులు, యువ ఆవిష్కర్తలకు ఇది కొత్త అవకాశాలు సృష్టిస్తుందని తెలిపారు.
సురక్షిత సమాచార మార్పిడి, విశ్వసనీయ డిజిటల్ మౌలిక సదుపాయాలు, సైబర్ రెసిలియన్స్ దేశాల భవిష్యత్తుకు కీలకమని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ ప్రారంభంతో ఈ రంగంలో కీలక ముందడుగు వేసినట్లు గుర్తుచేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















