కోల్‌కతా నుంచి చెన్నై వస్తున్న ఇండిగో విమానంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం గగనతలంలో ఉండగా ఎడమవైపు ఇంజిన్‌లో వైఫల్యాన్ని పైలట్ గుర్తించారు. దీంతో చెన్నై విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించి సురక్షిత ల్యాండింగ్‌కు ఏర్పాట్లు చేశారు.
224 మంది ప్రయాణికులతో కోల్‌కతా నుంచి బయల్దేరిన విమానం రాత్రి 11.30 గంటల సమయంలో చెన్నై చేరుకోవాల్సి ఉంది. ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఎడమవైపు ఇంజిన్‌లో సమస్య ఉన్నట్లు పైలట్ గుర్తించారు. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించారు.
దీంతో చెన్నై విమానాశ్రయ అధికారులు అప్రమత్తమై అత్యవసర ఏర్పాట్లు చేపట్టారు. విమానం సురక్షితంగా దిగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. ఎమర్జెన్సీ ప్రకటించిన ఏడు నిమిషాలకే విమానం ఎలాంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు, విమానాశ్రయ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
విమానం ల్యాండ్ అయిన మరో పది నిమిషాల తర్వాత అత్యవసర పరిస్థితిని ఉపసంహరించారు. దీంతో విమానాశ్రయంలో కార్యకలాపాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ఇంజిన్ వైఫల్యానికి కారణాలపై అధికారులు పరిశీలన చేపట్టారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















