బహుళజాతి సంస్థ పెప్సీకో మాజీ చైర్పర్సన్, సీఈవో ఇంద్రా నూయీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా కాకుండా భారత్ సహా ఇతర దేశాల్లో ఉండి ఉంటే తాను సీఈవో స్థాయికి చేరలేకపోయేదానినని ఆమె అభిప్రాయపడ్డారు. అమెరికాలో ఉన్న ప్రతిభ ఆధారిత (మెరిటోక్రటిక్) వ్యవస్థే తన ఎదుగుదలకు ప్రధాన కారణమని ఆమె పేర్కొన్నారు.
అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి కండోలీజా రైస్‌తో ‘ఆవిష్కరణ, యోగ్యతా విధానం’పై జరిగిన సంభాషణలో నూయీ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా వ్యవస్థలో లింగం, నేపథ్యం కాకుండా ప్రతిభకే ప్రాధాన్యం ఇస్తారని ఆమె తెలిపారు. అత్యుత్తమ మేధావులు మాత్రమే ఉన్నత స్థానాలకు ఎదగాలని అక్కడి వ్యవస్థ లక్ష్యమని చెప్పారు.
వలసదారులకు అమెరికాలో లభించే అవకాశాలు మరెక్కడా దొరకవని, అమెరికా ఒక ఉత్తమ దేశమని ఇంద్రా నూయీ అభిప్రాయపడ్డారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















