దేశంలో మేనేజ్‌మెంట్ కోర్సులకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIMs)లో చదవాలని అనుకునే విద్యార్థులకు ఇంటర్ తర్వాతే అవకాశం కల్పించే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (IPM) ఒక మంచి మార్గం.
ఈ కోర్సులు సాధారణంగా ఐదేళ్ల పాటు కొనసాగుతాయి. మొదటి మూడు సంవత్సరాలు ఫౌండేషన్ కోర్సులు కాగా, చివరి రెండు సంవత్సరాలు ఎంబీఏ స్థాయి మేనేజ్‌మెంట్ చదువులు ఉంటాయి. మ్యాథ్స్, ఎకనామిక్స్, సైకాలజీ, స్టాటిస్టిక్స్ వంటి సబ్జెక్టులతో పాటు కమ్యూనికేషన్, లీడర్‌షిప్ నైపుణ్యాలను అభివృద్ధి చేస్తారు.
ఇందులో చేరిన విద్యార్థులు డిగ్రీ పూర్తయ్యాక క్యాట్ పరీక్ష అవసరం లేకుండా అదే ఐఐఎంలో ఎంబీఏ కొనసాగించవచ్చు. ఇది ఈ కోర్సుల ప్రధాన ప్రయోజనం. అలాగే మూడు సంవత్సరాల తర్వాత బయటకు రావాలనుకుంటే బీబీఏ/సంబంధిత డిగ్రీతో బయటకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది.
అడ్మిషన్ ప్రక్రియలో ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ, అకడమిక్ మెరిట్‌ను పరిగణలోకి తీసుకుంటారు. ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, ఇంగ్లిష్, మ్యాథ్స్‌పై ప్రశ్నలు వస్తాయి.
ఐఐఎం ఇండోర్, రోహ్‌తక్, రాంచీ, అమృత్‌సర్, షిల్లాంగ్ వంటి సంస్థలు ఈ కోర్సులను అందిస్తున్నాయి. అదనంగా ఐఐఎఫ్‌టీ, నిర్మా యూనివర్సిటీ, ఎన్ఎంఐఎంఎస్, జిందాల్ బిజినెస్ స్కూల్ వంటి సంస్థలు కూడా ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సులు నిర్వహిస్తున్నాయి.
జిప్‌మ్యాట్ (JIPMAT) ద్వారా ఐఐఎం బోధ్‌గయ, జమ్మూలో అడ్మిషన్లు పొందవచ్చు. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, వెర్బల్ ఎబిలిటీ అంశాలపై పరీక్ష ఉంటుంది.
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ కోర్సులకు అర్హులు. జూన్ 7న పరీక్ష నిర్వహించనున్నారు.
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ చూడండి:
exams.nta.nic.in/
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















