హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB)లో టెక్నీషియన్ మరియు డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 22 టెక్నీషియన్ పోస్టులు, 1 డ్రైవర్ పోస్టు ఖాళీగా ఉన్నాయి.
టెక్నీషియన్ పోస్టులకు 55% మార్కులతో పదో తరగతి పూర్తి చేసి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి. లేదా అప్రెంటిస్‌గా అనుభవం ఉన్నవారికి కూడా అవకాశం ఉంది. డ్రైవర్ పోస్టుకు పదో తరగతి, లైట్ & హెవీ వాహన డ్రైవింగ్ లైసెన్స్, కనీసం 3 సంవత్సరాల అనుభవం అవసరం.
ఎంపిక ప్రక్రియలో టెక్నీషియన్ పోస్టులకు ట్రేడ్ టెస్ట్, రాత పరీక్షలు నిర్వహిస్తారు. రాత పరీక్షలో మెంటల్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్, సబ్జెక్ట్ సంబంధిత ప్రశ్నలు ఉంటాయి. డ్రైవర్ పోస్టుకు స్కిల్ టెస్ట్ తర్వాత రాత పరీక్ష ఉంటుంది.
వయసు పరిమితి టెక్నీషియన్‌కు 28 సంవత్సరాలు, డ్రైవర్‌కు 27 సంవత్సరాలు. రిజర్వేషన్ వర్గాలకు వయస్సులో సడలింపులు వర్తిస్తాయి.
ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ 26-05-2026 కాగా, పోస్టు ద్వారా దరఖాస్తులు పంపేందుకు 05-06-2026 చివరి తేదీగా నిర్ణయించారు.
మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ చూడండి:
www.ccmb.res.in/
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















