ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) వాణిజ్య సిలిండర్ ధరలను మరోసారి పెంచింది. తాజా నిర్ణయం ప్రకారం 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్‌పై రూ.42 వరకు ధర పెంపు చేసినట్లు సంస్థ తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. కోల్‌కతాలో ఈ పెంపు రూ.53.50గా నమోదైంది.
అలాగే 5 కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్ల ధరలను కూడా రూ.11 చొప్పున పెంచారు. అయితే గృహ వినియోగ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేశారు.
భారతదేశంలో సాధారణంగా ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కలిసి ఎల్పీజీ రిటైల్ ధరలను నిర్ణయిస్తాయి. దీంతో ఇతర సంస్థల గ్యాస్ ధరలపై కూడా ఇదే ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇక అంతర్జాతీయంగా ఇరాన్–అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్ జలసంధి వద్ద నౌకల రవాణా అంతరాయం ఏర్పడటంతో భారత్‌లో ఎల్పీజీ ధరలపై ప్రభావం పడుతోంది. భారత్‌కు అవసరమైన ఎల్పీజీ పెద్ద భాగం ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాల నుంచి ఇదే మార్గం ద్వారా దిగుమతి అవుతోంది.
ఈ పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలకు కనీసం 30 రోజుల అవసరాలకు సరిపడా ఎల్పీజీ నిల్వలు సిద్ధంగా ఉంచాలని సూచించింది. దిగుమతుల్లో ఏర్పడే అంతరాయాలను తగ్గించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















