అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. తమ గగనతలంలోకి ప్రవేశించిన అమెరికాకు చెందిన ఎంక్యూ-9 రీపర్ డ్రోన్‌ను కూల్చివేశామని ఇరాన్ ప్రకటించింది. అలాగే ఆర్‌క్యూ-4 డ్రోన్, ఎఫ్-35 యుద్ధ విమానాలపై కూడా కాల్పులు జరిపినట్లు వెల్లడించింది. టెహ్రాన్‌పై అమెరికా దాడులకు ప్రతిస్పందనగానే ఈ చర్యలు చేపట్టినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) పేర్కొంది.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘిస్తే మరింత తీవ్ర ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరించింది. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలు ఇక సురక్షితంగా ఉండవని మొజ్తాబా ఖమేనీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా, ఇజ్రాయెల్‌లపై పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
మరోవైపు అమెరికా మాత్రం తాము ఆత్మరక్షణ కోసమే దాడులు చేశామని తెలిపింది. ఇరాన్ క్షిపణి ప్రయోగ కేంద్రాలు, సముద్రంలో మందుపాతరలు పరిచే బోట్లను లక్ష్యంగా చేసుకొని చర్యలు చేపట్టామని వెల్లడించింది. బందర్ అబ్బాస్ పోర్టులోని నేవీ బేస్ కూడా దాడుల్లో ధ్వంసమైనట్లు అమెరికా అధికారులు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government HyderabadNews India IndiaNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews


















