అమెరికా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైట్‌హౌస్‌లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రభావం తగ్గుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ యుద్ధం, విదేశాంగ విధానాల విషయంలో వాన్స్ అభిప్రాయాలను ట్రంప్ పక్కన పెడుతున్నట్లు సమాచారం.
ఇరాన్‌పై దూకుడుగా వ్యవహరించాలని భావిస్తున్న ట్రంప్.. విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ఎక్కువగా చర్చలు జరుపుతున్నారని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు యుద్ధాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాన్స్.. ప్రపంచానికి అణ్వాయుధాల ముప్పు పెరుగుతోందని హెచ్చరిస్తున్నారు.
ఇటీవల జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బార్డ్ క్యాబినెట్ నుంచి తప్పుకోవడం కూడా వాన్స్‌కు పెద్ద దెబ్బగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో 2028 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై కూడా వాన్స్ వెనక్కి తగ్గుతున్నారనే ప్రచారం జోరందుకుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















