Iranలో నాయకత్వ మార్పు తీసుకురావడమే అమెరికా యుద్ధ వ్యూహాల్లో ఒకటిగా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అయతుల్లా అలీ ఖమేనీ హత్య అనంతరం మాజీ అధ్యక్షుడు Mahmoud Ahmadinejad నేతృత్వంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు United States, Israel కలిసి ప్రయత్నించినట్లు వార్తలు వెలువడ్డాయి.
వెనెజువెలాలో అమలు చేసిన తరహా వ్యూహాన్ని ఇరాన్‌లో కూడా అమలు చేయాలని అమెరికా భావించినట్లు కథనాలు పేర్కొన్నాయి. ఇరాన్ ప్రస్తుత నాయకత్వంతో అహ్మదినెజాద్‌కు ఉన్న విభేదాలను తమకు అనుకూలంగా మలుచుకోవాలని అమెరికా-ఇజ్రాయెల్ ప్రయత్నించినట్లు సమాచారం.2005 నుంచి 2013 వరకు ఇరాన్ అధ్యక్షుడిగా పనిచేసిన అహ్మదినెజాద్.. ఇజ్రాయెల్‌పై తీవ్ర విమర్శలు చేసిన నేతగా గుర్తింపు పొందారు. అనంతరం ఖమేనీ వర్గంతో విభేదాల కారణంగా ఆయన గృహ నిర్బంధంలో ఉన్నట్లు ప్రచారం జరిగింది.యుద్ధానికి కొద్ది రోజుల ముందు అహ్మదినెజాద్ హంగరీ, గ్వాటమాలా దేశాల్లో పర్యటించినట్లు వార్తలు రావడం కూడా చర్చనీయాంశమైంది. ఆ దేశాలకు ఇజ్రాయెల్‌తో సత్సంబంధాలు ఉండటం గమనార్హం.
యుద్ధం ప్రారంభమైన రోజే అహ్మదినెజాద్‌ను బయటకు తీసుకురావడానికి అమెరికా-ఇజ్రాయెల్ ఆయన నివాసంపై దాడి చేశాయన్న వార్తలు కూడా వెలువడ్డాయి. అయితే అప్పటి నుంచి ఆయన బహిరంగంగా కనిపించకపోవడం ఉత్కంఠ రేకెత్తిస్తోంది.అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే అహ్మదినెజాద్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండేదని ఇజ్రాయెల్ అధికార వర్గాలు పేర్కొన్నట్లు కథనాలు చెబుతున్నాయి. అయితే ఆ ప్రయత్నాలు విఫలమైనట్లు తెలుస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















