Tamil Naduలో దారుణ ఘటన వెలుగుచూసింది. మాటలు రాని ఓ దివ్యాంగ మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన పుదుకోట్టై జిల్లా కరంబక్కుడి సమీపంలో చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. 35 ఏళ్ల అవివాహిత మహిళ సమీప గ్రామంలోని ఓ రైస్‌మిల్లులో పనిచేస్తోంది. ఆదివారం సాయంత్రం పని ముగించుకుని బస్టాప్‌లో నిల్చుని ఉండగా కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు గ్రామంలో దింపుతామని చెప్పి ఆమెను బలవంతంగా వాహనంలో ఎక్కించుకున్నారు.తర్వాత నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం కరంబక్కుడి-ఆలంకుడి రోడ్డుపై బాధితురాలిని వదిలేసి పరారయ్యారు.బాధితురాలి అరుపులు విన్న స్థానికులు ఆమెను కాపాడి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి.. మనకొల్లై ప్రాంతానికి చెందిన కారు యజమాని శేఖర్, అతని స్నేహితుడు మారిముత్తును గుర్తించి మంగళవారం అరెస్టు చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















