అమెరికా ఆంక్షలు, దిగ్బంధనంతో ఇంధన రంగంలో ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఇరాన్‌కు భారీ ఊరట లభించింది. దక్షిణ ఫార్స్ ప్రావిన్స్‌లో 7.5 ట్రిలియన్ ఘనపుటడుగులకు పైగా సహజవాయు నిల్వలను గుర్తించినట్లు ఆ దేశ చమురు శాఖ మంత్రి మొహ్సెన్ పక్నెజాద్ వెల్లడించారు.
ఈ నిల్వల్లో సుమారు 72 నుంచి 73 శాతం వరకు గ్యాస్‌ను వెలికితీయగలమని అంచనా వేస్తున్నారు. అంటే దాదాపు 5.7 ట్రిలియన్ ఘనపుటడుగుల సహజవాయును వాణిజ్య అవసరాలకు వినియోగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. కొత్తగా గుర్తించిన గ్యాస్ ‘స్వీట్ గ్యాస్’ కావడం మరో ప్రత్యేకత. ఇందులో హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి మలినాలు తక్కువగా ఉండటంతో శుద్ధి ప్రక్రియ సులభమై, ఉత్పత్తి వ్యయాలు తగ్గే అవకాశం ఉంది.
ఇరాన్ ఇప్పటికే భారీ సహజవాయు నిల్వలతో ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. ఆ దేశంలో సుమారు 34 ట్రిలియన్ క్యూబిక్ మీటర్ల సహజవాయు నిల్వలు ఉన్నట్లు అంచనా. తాజా ఆవిష్కరణతో ఇరాన్ ఇంధన సంపద మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
అయితే ఈ గ్యాస్‌ను వాణిజ్యపరంగా వినియోగంలోకి తీసుకురావడం అంత సులభం కాదు. కొత్త క్షేత్ర అభివృద్ధికి భారీ పెట్టుబడులతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం. యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ ఆంక్షలు, అమెరికా దిగ్బంధనం నేపథ్యంలో పెట్టుబడులు, సాంకేతిక వనరులను సమకూర్చుకోవడం ఇరాన్‌కు సవాలుగా మారొచ్చు.
అంతేకాకుండా అమెరికా ఆర్థిక ఆంక్షల కారణంగా కొత్తగా లభించే గ్యాస్‌ను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసి ఆదాయం పెంచుకోవడం కూడా ఇరాన్‌కు సులభం కాకపోవచ్చు. దీంతో భారీ గ్యాస్ నిల్వలు వెలుగులోకి వచ్చినప్పటికీ.. వాటిని ఆర్థికంగా ఎంతవరకు ఉపయోగించుకోగలదన్నది కీలకంగా మారింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















