అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో సంబంధించి చేసిన వ్యాఖ్యలను ఇరాన్ మీడియా తీవ్రంగా విమర్శిస్తూ ఎగతాళి చేసింది. “ట్రంప్ గాల్లో మేడలు కడుతున్నారు” అంటూ సెటైరిక్ వ్యాఖ్యలు చేసింది.ట్రంప్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, ఇరాన్‌తో త్వరలో ఒప్పందం కుదరనుందని తెలిపారు. అలాగే ఇరాన్ తమకు ఉచిత చమురు ఇవ్వడంతో పాటు హర్మూజ్ జలసంధిని కూడా అందించనుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.
ఇరాన్ ప్రభుత్వ మీడియా ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. ట్రంప్ చేసిన వ్యాఖ్యల వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆయన వాస్తవానికి దూరంగా మాట్లాడుతున్నారని విమర్శించింది. “అతను ఊహల్లో జీవిస్తున్నాడు” అనే అర్థం వచ్చేలా ఒక సామెతను కూడా ప్రస్తావించింది.
ఇక ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఘాలిబఫ్ సన్నిహిత వర్గాలు ట్రంప్ చేసిన మరో ప్రకటనను కూడా ఖండించాయి. యురేనియం నిల్వలను అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించిందన్న వాదన పూర్తిగా అబద్ధమని స్పష్టం చేశాయి.ఇలాంటి ఏ ఒప్పందమూ ఇప్పటివరకు జరగలేదని, చర్చలు కొనసాగాలంటే అమెరికా ఇరాన్ షరతులకు అంగీకరించాల్సిందేనని ఇరాన్ వర్గాలు పేర్కొన్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















