ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్ అసాధారణ ప్రతిభ కనబరిచి భారత్‌కు గర్వకారణంగా నిలిచింది. బుధవారం ప్రారంభమైన ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించిన ఇషా, అదే ఈవెంట్‌లో టీమ్ విభాగంలోనూ గోల్డ్ గెలిచి డబుల్ ఘనత అందుకుంది.
వ్యక్తిగత విభాగం ఫైనల్లో ఇషా 239.8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. చైనీస్ తైపీకి చెందిన చెంగ్ యెన్ చెంగ్ (235.4) రజతం, యీ అయ్ వెన్ (217.7) కాంస్య పతకం అందుకున్నారు. ఈ పోటీలో డబుల్ ఒలింపిక్ పతక విజేత మను బాకర్ ఏడో స్థానంలో నిలవడం గమనార్హం.

మహిళల టీమ్ విభాగంలో “సురుచి (576), ఇషా (575), మను (575)” లతో కూడిన భారత జట్టు మొత్తం 1726 పాయింట్లు సాధించి స్వర్ణాన్ని గెలుచుకుంది. వియత్నాం (1713) రజతం, చైనీస్ తైపీ (1711) కాంస్య పతకాలను దక్కించుకున్నాయి.
ఇక పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో సామ్రాట్ రాణా కాంస్య పతకం సాధించాడు. ఫైనల్లో 220.3 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఉజ్బెకిస్థాన్‌కు చెందిన వెచ్నికోవ్ (242) స్వర్ణం, కజకిస్థాన్‌కు చెందిన రకీమ్‌జాన్ (241) రజతం గెలుచుకున్నారు.
పురుషుల టీమ్ విభాగంలో “సామ్రాట్ (581), శ్రవణ్ (578), వరుణ్ తోమర్ (573)” లతో కూడిన భారత బృందం మొత్తం 1732 పాయింట్లు సాధించి రజత పతకంతో సరిపెట్టుకుంది. సమాన పాయింట్లు సాధించినప్పటికీ మధ్య వృత్తానికి సమీపంగా ఎక్కువ పదులు నమోదు చేయడంతో ఉజ్బెకిస్థాన్ స్వర్ణాన్ని దక్కించుకుంది. కజకిస్థాన్ (1731) కాంస్యంతో నిలిచింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















