కల్తీ ఆహారం సమస్యపై సమాజంలో పెరుగుతున్న ఆందోళనను ప్రధాన అంశంగా తీసుకుని కథానాయిక కాజల్ అగర్వాల్ కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆమె, శ్రేయాస్ తల్పాడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా పేరు ‘ది ఇండియా స్టోరీ’.
చెట్టన్ డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను చిత్రబృందం ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ వేదికగా విడుదల చేసింది. “సంఖ్యలు బహిరంగంగానే ఉన్నాయి. పరిణామాలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. అయినా కూడా నిజం ఇంకా దాగి ఉన్నట్లు ఎందుకనిపిస్తోంద” అనే సందేశంతో టీజర్ ప్రారంభమవుతుంది. ఇది ఆహార భద్రతపై గంభీరమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది.
నేటి రోజుల్లో కల్తీ ఆహారం, కల్తీ నెయ్యి, విషపూరిత పంటల వినియోగం వంటి సమస్యలు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఈ సినిమా ద్వారా చూపించనున్నారు. ఆహార ఉత్పత్తిలో రసాయనాలు, పురుగు మందుల అధిక వినియోగం వల్ల జరుగుతున్న నష్టాలను కథలో ప్రధానంగా చూపించనున్నారు.
టీజర్‌లో “ఆహారాన్ని కాదు.. విషాన్ని పండిస్తున్నాం”, “ప్రతి ఏడాది 10 లక్షల మందికి పైగా మరణిస్తున్నారు” వంటి సంచలన వ్యాఖ్యలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తున్నాయి.
ఈ చిత్రంలో కాజల్ ఒక న్యాయవాది పాత్రలో కనిపించనుండగా, సమాజానికి సంబంధించి కీలకమైన కేసును ఆమె ఎలా ఎదుర్కొంటుందన్నదే కథ ప్రధానాంశంగా ఉండనుంది. జులై 24న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















