ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో బ్యాంకు లాకర్‌లో దాచిన సుమారు రూ.50 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. ఏళ్ల తర్వాత లాకర్‌ను తెరిచిన మహిళకు అందులో ఒక్క ఆభరణం కూడా కనిపించలేదు. బాధితురాలి ఫిర్యాదుతో బ్యాంకు బ్రాంచ్ మేనేజర్‌తో పాటు సంబంధిత సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కాన్పూర్‌లోని స్వరూప్‌నగర్‌కు చెందిన రష్మి అరోరా తన భర్తతో కలిసి 2003 ఫిబ్రవరి 26న అప్పటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్‌లో ఖాతా తెరిచారు. అదే సమయంలో బ్యాంకు సిబ్బంది వారికి లాకర్ నంబర్ 23ను కేటాయించారు. అందులో సుమారు రూ.50 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను భద్రపరిచినట్లు రష్మి తెలిపారు.
కొంతకాలం పాటు దంపతులు క్రమం తప్పకుండా బ్యాంకుకు వెళ్లి లాకర్‌ను పరిశీలించేవారు. అయితే రష్మి భర్త మరణించిన తర్వాత ఆమె లఖ్‌నవూలోని కుమార్తె వద్ద ఉంటున్నారు. దూరం కారణంగా బ్యాంకుకు వెళ్లడం తగ్గిపోయింది. ఇదిలా ఉండగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమైంది.
సుమారు నాలుగు నెలల క్రితం కుమార్తెతో కలిసి బ్యాంకుకు వెళ్లిన రష్మికి తన పేరుతో లాకర్ లేదని సిబ్బంది చెప్పడంతో అనుమానం వచ్చింది. పాత ఖాతా, లాకర్‌కు సంబంధించిన పత్రాలను తీసుకుని మరోసారి బ్యాంకును సంప్రదించారు.
ఆ సమయంలో లాకర్ అద్దె ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా కట్ అవుతూ రావడంతో ఖాతాలోని నగదు మొత్తం ఖాళీ అయిందని, దీంతో ఖాతా ఇన్‌యాక్టివ్ అయిందని బ్యాంకు మేనేజర్ వివరించినట్లు రష్మి తెలిపారు. జులై 21న ఖాతాలో నగదు జమ చేసి తిరిగి యాక్టివేట్ చేసుకున్నారు.
అయితే ఆ రోజు లాకర్ తాళం తన వద్ద లేకపోవడంతో దాన్ని తెరవలేదు. జులై 27న తాళంతో బ్యాంకుకు వెళ్లి లాకర్ నంబర్ 23ను తెరిచిన రష్మికి తీవ్ర షాక్ ఎదురైంది. లాకర్‌లో ఒక్క ఆభరణం కూడా లేకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు.
తన ఆభరణాలు అదృశ్యం కావడానికి బ్యాంకు యాజమాన్యం, సిబ్బంది కుట్ర కారణమై ఉండొచ్చని రష్మి ఆరోపించారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా బ్రాంచ్ మేనేజర్‌తో పాటు సంబంధిత సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
లాకర్ రికార్డులు, సంబంధిత పత్రాలు, సిబ్బంది పాత్రపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బ్యాంకులోని సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నామని కాన్పూర్ డీసీపీ అతుల్ శ్రీవాస్తవ వెల్లడించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















