‘కర్మాఖ్య’ కథ ప్రారంభం ఆసక్తికరంగా సాగుతుంది. కామాఖ్య, ప్రవల్లిక ఇద్దరు స్నేహితులు. అనుకోని పరిస్థితుల్లో ప్రవల్లికకు బదులుగా కామాఖ్య ఓ పాలసీదారుడి ఇంటికి వెళ్లడంతో అసలు కథ మొదలవుతుంది. నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న ఆ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఆమెకు ఎదురయ్యే వింత సంఘటనలు, అక్కడి పాత్రల ప్రవర్తన ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతాయి.
ఆ ఇంటి నుంచి బయటపడేందుకు కామాఖ్య చేసే ప్రయత్నాలు, ఆమెకు ఎదురయ్యే అనూహ్య పరిణామాలు కథలో ఉత్కంఠను పెంచుతాయి. ముఖ్యంగా ద్వితీయార్ధంలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు, వరుస మలుపులు సినిమాను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. తంత్ర విద్యలు, శక్తిపీఠాలు, మూఢనమ్మకాలు, ఆధునిక శాస్త్ర సాంకేతికత వంటి అంశాలను కథలో మేళవిస్తూ దర్శకుడు అభినయ కృష్ణ సినిమాను తెరకెక్కించారు.
అయితే సినిమా ప్రారంభ భాగం కాస్త నెమ్మదిగా సాగుతుంది. ప్రధాన కథ మొదలైన తర్వాత మాత్రం వేగం పుంజుకుంటుంది. సమైరా కొత్త నటిగా మంచి నటనను ప్రదర్శించగా.. శరణ్య ప్రదీప్, అభిరామి, ఆనంద్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సముద్రఖని, ధన్‌రాజ్, మధునందన్ తదితరుల పాత్రలు కూడా కథకు అనుగుణంగా సాగుతాయి.
సాంకేతికంగా సినిమా మంచి స్థాయిలో ఉంది. ముఖ్యంగా గ్యాని నేపథ్య సంగీతం థ్రిల్లింగ్ వాతావరణాన్ని మరింత బలపరిచింది. సినిమాటోగ్రఫీ కూడా కథకు తగ్గట్టుగా ఉంది. దర్శకుడు అభినయ కృష్ణ కథను ఆసక్తికరమైన మలుపులతో తెరపైకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. మొత్తంగా మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘కర్మాఖ్య’ మంచి అనుభూతిని అందించే చిత్రంగా నిలుస్తుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















