కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఎట్టకేలకు ఖరారవడంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బెంగళూరులో తన నివాసంలో నిర్వహించిన బ్రేక్‌ఫాస్ట్ సమావేశంలో క్యాబినెట్ మంత్రులకు ఈ విషయాన్ని వెల్లడించారు. తదుపరి ముఖ్యమంత్రిని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుందని, ఎవరు బాధ్యతలు చేపట్టినా వారికి పూర్తి సహకారం అందిస్తానని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
ఇప్పటికే సిద్ధరామయ్య తన రాజీనామా లేఖను గవర్నర్ కార్యాలయానికి పంపించినట్లు సమాచారం. అయితే గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ ప్రస్తుతం కుటుంబ కారణాలతో బెంగళూరుకు బయట ఉన్నప్పటికీ, రాజీనామా ప్రక్రియ కొనసాగుతోందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం శనివారం జరిగే అవకాశమున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. నాయకత్వ మార్పు సందర్భంగా జరిగిన అల్పాహార సమావేశంలో డీకే శివకుమార్ సిద్ధరామయ్య పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అనంతరం ఇద్దరు నేతలు పరస్పరం ఆలింగనం చేసుకోవడంతో ఆ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించినప్పటి నుంచే రెండున్నరేళ్ల తర్వాత అధికార మార్పిడి జరుగుతుందనే ప్రచారం కొనసాగింది. గతంలో అలాంటి ఒప్పందం లేదని సిద్ధరామయ్య ఖండించినప్పటికీ, తాజాగా ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ అధిష్ఠానం సమావేశంలో నాయకత్వ మార్పుపై తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















