తెలంగాణ నుంచి ఏపీ మీదుగా తమిళనాడుకు ప్రయాణించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సమాచారాన్ని విడుదల చేసింది. చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12759/12760) ప్రయాణ మార్గంలో తాత్కాలిక మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. చెన్నై ఎగ్మోర్ స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనుల కారణంగా ఈ మార్పులు అమల్లోకి వస్తున్నాయి.
సాధారణంగా హైదరాబాద్ నుంచి తమిళనాడులోని తాంబరం వరకు నడిచే చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌ను తాత్కాలికంగా చెన్నై బీచ్ రైల్వే స్టేషన్ వరకే పరిమితం చేశారు. ఈ మార్పు ఫిబ్రవరి 3 నుంచి ఏప్రిల్ 4 వరకు అమల్లో ఉంటుంది. హైదరాబాద్ నుంచి బయలుదేరే రైలు నంబర్ 12760 ఈ కాలంలో ఉదయం 7 గంటలకు చెన్నై బీచ్ స్టేషన్‌కు చేరుకుంటుంది.
అదేవిధంగా, తిరుగు ప్రయాణంలో చెన్నై బీచ్ నుంచి బయలుదేరే చార్మినార్ ఎక్స్‌ప్రెస్ 12759 రైలు ఫిబ్రవరి 4 నుంచి ఏప్రిల్ 5 వరకు అమల్లో ఉంటుంది. ఈ రైలు చెన్నై బీచ్ స్టేషన్ నుంచి సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు.
ఈ మార్పుల నేపథ్యంలో చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించే ప్రయాణికులు టికెట్ బుకింగ్ సమయంలో గమ్యస్థానాన్ని చెన్నై బీచ్ స్టేషన్‌గా ఎంచుకోవాలని రైల్వే శాఖ సూచించింది. ప్రయాణికులు ఈ తాత్కాలిక మార్పును గమనించి ముందుగానే ప్రణాళికలు చేసుకోవాలని కోరింది.
Andhra pradesh Andhrapradesh APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews



















