టెక్ దిగ్గజ సంస్థ Microsoft గేమింగ్ విభాగమైన Microsoft Gaming లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. భారత సంతతి టెకీ Asha Sharma ను కొత్త సీఈవోగా సంస్థ నియమించింది. ఇప్పటివరకు ఈ బాధ్యతలు నిర్వహించిన Phil Spencer పదవీవిరమణ చేయడంతో, గేమింగ్ డివిజన్‌కు సీఈఓ మరియు వైస్ ప్రెసిడెంట్‌గా ఆశా శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు.ప్రస్తుతం గేమింగ్ మార్కెట్‌లో తీవ్ర పోటీ, కంటెంట్ అభివృద్ధిలో భారీ పెట్టుబడులు, ఆదాయ వృద్ధిలో మందగింపు వంటి సవాళ్లను ఆమె ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సంస్థలో వ్యూహాత్మక మార్పులు తీసుకురావాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
మైక్రోసాఫ్ట్‌లో చేరకముందు ఆశా శర్మ పలు అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థల్లో ఉన్నత పదవుల్లో పని చేశారు. గేమింగ్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించే ముందు, మైక్రోసాఫ్ట్‌లోని కోర్ ఏఐ విభాగంలో సీనియర్ అధికారిగా సేవలందించారు.అదే సమయంలో సంస్థలో ఇతర ఉన్నత స్థాయిలోనూ మార్పులు చేసినట్లు వెల్లడించింది. గేమ్ స్టూడియోలు, టైటిల్స్‌ను పర్యవేక్షించే చీఫ్ కంటెంట్ ఆఫీసర్‌గా Matt Booty కు పదోన్నతి కల్పించినట్లు తెలిపింది.
విద్యా విషయానికి వస్తే, ఆశా శర్మ Carlson School of Management, University of Minnesota నుంచి బిజినెస్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పూర్తి చేశారు. కెరీర్ ప్రారంభంలో మైక్రోసాఫ్ట్ మార్కెటింగ్ విభాగంలో పనిచేసిన ఆమె, 2013లో సంస్థను వీడి వివిధ గ్లోబల్ టెక్ కంపెనీల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. రెండేళ్ల క్రితం మళ్లీ మైక్రోసాఫ్ట్‌లో చేరి కోర్ ఏఐ విభాగంలో ఉన్నతాధికారిగా కొనసాగుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















