ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఎట్టకేలకు విజయాల బోణీ కొట్టింది. సీజన్‌లో తమ ఏడో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచి తొలి విజయాన్ని నమోదు చేసింది.156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఈ మ్యాచ్ తర్వాత కేకేఆర్ డ్రెస్సింగ్ రూమ్‌లో భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఆటగాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారని బౌలర్ వరుణ్ చక్రవర్తి వెల్లడించాడు. తాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన వరుణ్ మూడు కీలక వికెట్లు తీసి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు.
“ఈ విజయం చాలా ప్రత్యేకం. డ్రెస్సింగ్ రూమ్‌లో భావోద్వేగాలు చూశాం. ఇంతకు ముందు ఇలాంటి పరిస్థితి చూడలేదు. ఇది కోచింగ్ స్టాఫ్ కృషి వల్లే సాధ్యమైంది” అని వరుణ్ చక్రవర్తి పేర్కొన్నాడు.
గాయాలతో సీజన్ ప్రారంభమైనందున జట్టు ప్రదర్శనపై ప్రభావం పడిందని ఆయన తెలిపారు. కీలక ఆటగాళ్లు హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్ గాయాల కారణంగా దూరమవ్వగా, పతిరనా ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదని చెప్పారు. కామెరూన్ గ్రీన్ కూడా ఫిట్‌నెస్ కారణంగా పూర్తి స్థాయి బౌలింగ్ చేయలేకపోతున్నాడని తెలిపారు.అభిషేక్ నాయర్ నేతృత్వంలోని కోచింగ్ బృందం ఆటగాళ్లను నిరంతరం ప్రోత్సహించిందని, విమర్శలను దూరంగా ఉంచి జట్టును మానసికంగా బలంగా నిలబెట్టిందని వరుణ్ పేర్కొన్నాడు.ఈ విజయంతో కేకేఆర్ సీజన్‌లో కొత్త ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















