కొల్లేరు లంక గ్రామాల ప్రజలు, గ్రామ పెద్దలు చేపల చెరువుల లీజు బకాయిలు చెల్లించాలని కోరుతూ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. పెదవేగి మండలం వేగివాడలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
వైకాపా నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి కారు వద్దకు చేరుకున్న కొల్లేరు ప్రజలు తమకు ఏళ్ల తరబడి చెల్లించాల్సిన లీజు సొమ్మును ఇవ్వాలని కోరారు. ఈ సమయంలో అక్కడికి భారీగా చేరుకున్న వైకాపా కార్యకర్తలు ఆందోళనకారులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం.
లీజు బకాయిల అంశంపై స్పష్టత వచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదని ఆందోళనకారులు పట్టుబట్టారు. ఈ క్రమంలో అబ్బయ్య చౌదరి కారును ముందుకు తీసుకెళ్లాలని సూచించారని, డ్రైవర్ ఆందోళనకారుల మధ్య నుంచి కారును ముందుకు నడపడంతో పలువురు కిందపడి గాయపడ్డారని బాధితులు ఆరోపించారు.
ఆందోళనకారులకు మద్దతుగా వచ్చిన తెదేపా నాయకులు చెరుకూరి భగవాన్, దేవరపల్లి ఆదాములపై కూడా వైకాపా శ్రేణులు దాడి చేశాయని తెదేపా వర్గాలు ఆరోపించాయి. గాయపడిన వారిని ఏలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
క్షతగాత్రులను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరామర్శించారు. మరోవైపు సోమవారం రాత్రి తెదేపా నాయకులు, కొల్లేరు గ్రామాల ప్రజలు ఏలూరు అశోక్‌నగర్‌లోని అబ్బయ్య చౌదరి నివాసం వద్దకు భారీగా చేరుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు వారిని అడ్డుకుని అక్కడి నుంచి వెనక్కి పంపించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















