Kunavaram మండలంలోని అభిచర్ల సమీపంలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. పండ్రాజుపల్లికి చెందిన శ్యామల భీమేశ్వరరావు, వంజం లక్ష్మణ్, ముల్లూరుకు చెందిన పద్దం కార్తీక్ చిన్ననాటి స్నేహితులు. కలిసి చదువుకుని ప్రస్తుతం వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు.
సోమవారం బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లేందుకు భీమేశ్వరరావు, లక్ష్మణ్ ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మార్గమధ్యంలో కార్తీక్‌ను కూడా తమతో తీసుకెళ్లారు. అభిచర్ల సమీపంలోని మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ వారి బైక్‌ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో లక్ష్మణ్, కార్తీక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. భీమేశ్వరరావుకు తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించి, అనంతరం మెరుగైన చికిత్స కోసం భద్రాచలానికి పంపించారు.కుమారులు కుటుంబానికి అండగా నిలుస్తారని ఆశించిన కుటుంబాల్లో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















