ఒక చిన్న గ్రామంలో లక్ష్మి అనే అమ్మాయి ఉండేది. ఆమెకు ఒక ఆవు మాత్రమే ఉండేది. ప్రతిరోజూ తెల్లవారుజామున లేచి ఆవుకు గడ్డి పెట్టి, పాలు పితికి, వాటిని కుండ లో నింపుకుని ఊరికి వెళ్లి అమ్మేది. ఆ డబ్బులతోనే తన కుటుంబం రోజులు గడుపుకునేది.
ఒక రోజు ఆవు మామూలుకన్నా ఎక్కువ పాలు ఇచ్చింది. లక్ష్మికి ఎంతో ఆనందం కలిగింది. “ఇదే విధంగా ప్రతి రోజు ఎక్కువ పాలు ఇస్తే నేను త్వరలోనే ధనవంతురాలిని అవుతాను” అని ఊహించడం మొదలుపెట్టింది. పెద్ద కుండ లో పాలు నింపుకుని తలపై పెట్టుకుని ఊరికి బయలుదేరింది.
దారిలో నడుస్తూ ఆమె కలలు కట్టడం మొదలుపెట్టింది.
“ఈ అదనపు డబ్బును నేను ఖర్చు చేయను. దాచుకుంటాను. కొద్ది రోజుల్లోనే మరో ఆవు కొనుగోలు చేస్తాను. రెండు ఆవులు నాలుగు అవుతాయి. ఆ తర్వాత నాకు ఎంతో సంపాదన వస్తుంది. నేను కష్టపడాల్సిన పనిలేదు. పని చేసేందుకు కార్మికులను పెట్టుకుంటాను. నేను కొత్త పట్టు చీరలు వేసుకుని, నగలు ధరించి, అందంగా కనిపిస్తాను. ఊరిలో పెళ్లి ఉంటే అందరూ నన్నే చూస్తారు. నాకు మంచి వరుడు దొరుకుతాడు…”
ఇలా ఊహలలో మునిగిపోయి, “నాకు నచ్చని సంబంధం అయితే నేను ఒప్పుకోను” అని తల ఊపింది. కానీ తలపై ఉన్న కుండ బరువు మరిచిపోయింది. ఒక్కసారిగా కుండ జారిపోయి నేలమీద పడిపోయింది. కుండ పగిలిపో యింది ,పాలన్నీ చిందరవందరయ్యాయి.
లక్ష్మి ఒక్కసారిగా తేరుకుంది. తన కలలు అన్నీ క్షణాల్లో నేలరాలిపోయాయని గ్రహించింది. ఆమెకు బాధ వేసింది. “పగటి కలలు కనే బదులు, జాగ్రత్తగా నడిచుంటే బాగుండేది” అని ఆలోచించింది. ఖాళీ చేతులతో తిరిగి ఇంటివైపు నడిచింది.
ఆ రోజు ఆమెకు ఒక పెద్ద పాఠం తెలిసింది —
కలలు కనడం మంచిదే… కానీ చేస్తున్న పనిపై శ్రద్ధ పెట్టడం మరింత ముఖ్యము అని తెలుసుకుంది
కథ యొక్క నీతి
పగటి కలలు కనడం కంటే, ప్రస్తుత పనిపై దృష్టి పెట్టాలి.
ఆశలు మంచివే, కానీ అవి వాస్తవంతో కలిసివుండాలి.
జాగ్రత్తగా ఉండకపోతే చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టానికి దారి తీస్తుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews




















