అనంతపురం జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాపై భారీ స్థాయిలో టాస్క్‌ఫోర్స్ దాడులు నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో పెద్ద మొత్తంలో ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ముగ్గురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు ఏపీ టాస్క్‌ఫోర్స్ హెడ్, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు.
కపిలతీర్థం పరిధిలోని కార్యాలయంలో గురువారం ఆయన ఈ వివరాలను వెల్లడించారు. టాస్క్‌ఫోర్స్, అటవీ శాఖ సిబ్బంది కలిసి బుధవారం నార్పల మండలం బొందలవాడ ప్రాంతంలో దాడులు నిర్వహించి నల్లాని నందకుమార్, జయరామయ్య, బొట్టు రాఘవేంద్రలను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారి నుంచి ఒక కారు, సుమారు రూ.2 కోట్ల విలువ చేసే 109 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
నిందితులు ఎర్రచందనం చెట్లను నరికివేసి, వాటిని దిల్లీ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాలకు చెందిన పెద్ద స్మగ్లర్లకు విక్రయిస్తున్నట్లు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
ఇక ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక స్మగ్లింగ్ 70 శాతం వరకు తగ్గిందని ఆయన పేర్కొన్నారు. టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఆయన అభినందించారు. అక్రమ రవాణా పూర్తిగా అరికట్టేందుకు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















