మహీంద్రా థార్ దేశీయ మార్కెట్‌లో ప్రత్యేకమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. ముఖ్యంగా ఆఫ్‌రోడ్ వాహనాలను ఇష్టపడే వారికి థార్ నడపడం ఒక ప్రత్యేకమైన అనుభూతిగా మారింది. రోడ్డుపై వెళుతుంటే దాని రగ్గడ్ లుక్ కారణంగా చూపరులను ఆకట్టుకుంటుంది.
ఇప్పుడు ఈ థార్ కొత్త రూపంలో మరింత శక్తివంతంగా మారబోతోంది. “థార్ రాక్స్” పేరుతో రగ్గడ్ డిజైన్‌తో సరికొత్త అవతార్‌లో ఇది అందుబాటులోకి రానుంది. దీన్ని మహీంద్రా ఏటీవీ గా ప్రత్యేకంగా రూపొందించారు. ముఖ్యంగా దేశీయ సైనిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ వాహనాన్ని అభివృద్ధి చేశారు.మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఈ కొత్త వాహనాన్ని సోషల్ మీడియాలో పరిచయం చేశారు. బెంగళూరుకు చెందిన ప్రద్ 4×4 సంస్థతో కలిసి దీన్ని అభివృద్ధి చేసినట్లు ఆయన తెలిపారు.
సాధారణ కార్లలా అనవసరమైన అలంకరణలు లేకుండా, పూర్తిగా పనితీరు మరియు సామర్థ్యంపై దృష్టి పెట్టి ఈ వాహనాన్ని రూపొందించినట్లు ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. బలమైన మెటల్ బాడీతో తయారైన ఈ ఏటీవీ ఎయిర్‌డ్రాప్‌ను కూడా తట్టుకోగలదని తెలిపారు.అత్యంత కఠిన వాతావరణ పరిస్థితుల్లోనూ సులభంగా ప్రయాణించగల సామర్థ్యం ఈ వాహనానికి ఉందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా కొత్త మహీంద్రా ఏటీవీకి సంబంధించిన చిత్రాలను కూడా ఎక్స్ లో షేర్ చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















