అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు చమురు ధరలను పెంచడంతో మార్కెట్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఫలితంగా పెట్టుబడిదారులు భారీగా అమ్మకాలకు దిగడంతో ప్రధాన సూచీలు తీవ్రంగా క్షీణించాయి.
ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ సుమారు 2,400 పాయింట్లు పడిపోయి 76,505 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 726 పాయింట్లు నష్టపోయి 23,724 వద్ద కదలాడుతోంది. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ కూడా బలహీనపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 92.25 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సూచీలో కోల్ ఇండియా మాత్రమే లాభాల్లో ఉండగా, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా స్టీల్, మారుతీ సుజుకీ, ఎస్బీఐ వంటి ప్రధాన స్టాక్స్ నష్టాల్లో కనిపించాయి.రంగాల వారీగా చూస్తే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 5.6 శాతం వరకు క్షీణించగా, నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 4 శాతం పైగా పడిపోయింది. ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ కూడా 2.9 శాతం మేర తగ్గింది. రియల్టీ, లోహ రంగాల్లో కూడా అమ్మకాల ఒత్తిడి కనిపించింది. మార్కెట్ అస్థిరతను సూచించే విక్స్ సూచీ 20 శాతం పెరిగి 24.01కి చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దక్షిణ కొరియా కొస్పి సూచీ 8 శాతం పడిపోవడంతో సర్క్యూట్ బ్రేకర్ అమలు చేసి 20 నిమిషాల పాటు ట్రేడింగ్ నిలిపివేశారు. జపాన్ నిక్కీ కూడా సుమారు 7 శాతం క్షీణించింది. శుక్రవారం అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగియగా, నేటి ట్రేడింగ్‌లో ఆసియా మార్కెట్లు కూడా అదే బాటలో కొనసాగుతున్నాయి. అమెరికా డౌ ఫ్యూచర్స్ కూడా వెయ్యి పాయింట్లు పడిపోయింది.
పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల మార్క్‌ను దాటాయి. దీంతో ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయాలు మదుపర్లలో పెరిగాయి. ఈ పరిస్థితులు ఎక్కువకాలం కొనసాగితే భారీ చమురు దిగుమతిదారుల్లో ఒకటైన భారత్‌పై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇక విదేశీ సంస్థాగత మదుపర్లు (FII) కూడా భారత మార్కెట్ల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. గత శుక్రవారం ఒక్కరోజే సుమారు రూ.6,030 కోట్ల విలువైన షేర్లను వారు విక్రయించినట్లు మార్కెట్ గణాంకాలు సూచిస్తున్నాయి.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews Business BusinessNews ChandrababuNaidu Chandrababu naidu CricketNews CrimeNews Entertainment Geopolitics Government HealthyLifestyle India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews SportsNews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood WorldNews



















