కేరళ రాష్ట్రంలోని త్రిశ్శూర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ముందత్తికోడ్ ప్రాంతంలోని బాణసంచా తయారీ కేంద్రంలో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
పేలుడు జరిగిన సమయంలో అక్కడ దాదాపు 40 మంది వరకు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈనెల 26న జరగనున్న త్రిశ్శూర్ పూరమ్ ఆలయ ఉత్సవం కోసం బాణాసంచా తయారు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ, ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ఒక్కొక్క మృతుని కుటుంబానికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















