ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

రాజధానిలో సైబర్ నేరాల విపరీత పెరుగుదల.. ఆందోళనలో ప్రజలు

May 8, 2026
in Crime News, News
0
రాజధానిలో సైబర్ నేరాల విపరీత పెరుగుదల.. ఆందోళనలో ప్రజలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

దేశంలోని ప్రధాన మహానగరాలతో పోటీపడుతూ హైదరాబాద్‌లో నేరాల సంఖ్య వేగంగా పెరుగుతున్నట్లు జాతీయ నేర నమోదు సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) 2024 నివేదిక స్పష్టం చేసింది. ముఖ్యంగా బాల నేరాలు, సైబర్‌ మోసాలు, ఆర్థిక నేరాలు, మహిళలపై వేధింపులు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయని నివేదిక వెల్లడించింది. కుటుంబ పర్యవేక్షణ లోపం, ఆన్‌లైన్‌ గేమింగ్‌, బెట్టింగ్‌లు, మత్తు పదార్థాల ప్రభావంతో చిన్నారులు నేరాల బాట పడుతున్నారనే విషయం మరింత కలవరపెడుతోంది.

బాల్యం గాడితప్పుతోంది..

తెలిసీతెలియని వయసులోనే కొంతమంది బాలలు స్నాచింగ్‌లు, దొంగతనాలు, డ్రగ్‌ స్మగ్లింగ్‌లాంటి నేరాలకు పాల్పడుతున్నారు. చిన్ననేరాలతో ప్రారంభమైన ఈ ప్రయాణం హత్యలు, అత్యాచారాల వరకు వెళ్లడం పోలీసులను కూడా ఆందోళనకు గురిచేస్తోంది. 2023లో హైదరాబాద్‌లో జువెనైల్‌ నేరాలకు సంబంధించిన 180 కేసులు నమోదుకాగా.. 2024 నాటికి అవి 316కి పెరగడం తీవ్ర పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. వీరిలో ఎక్కువమంది 12-14 ఏళ్ల వయస్సు గల వారే కావడం గమనార్హం. తల్లిదండ్రులకు దూరంగా ఉండే పిల్లలే అధికంగా నేరాలకు పాల్పడుతున్నట్లు నివేదిక పేర్కొంది.

ఆర్థిక మోసాలు.. సైబర్‌ మాయలు

తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయన్న ఆశతో అమాయక ప్రజలు మోసగాళ్ల బారిన పడుతున్నారు. సొంతిల్లు, వ్యాపార భాగస్వామ్యం, తక్కువ ధరకు బంగారం వంటి పేర్లతో కోట్ల రూపాయలు దోచుకుంటున్న సైబర్‌ కేటుగాళ్లు రాజధానిలో విస్తరిస్తున్నారు. 2024లో 7,771 ఆర్థిక నేరాల కేసులతో ముంబయి దేశంలో మొదటి స్థానంలో ఉండగా.. హైదరాబాద్‌ రెండో స్థానంలో నిలిచింది. సైబర్‌ నేరాల్లో 4,009 కేసులతో దేశంలో మూడో స్థానంలో ఉంది.

నేరాలు పెరిగినా.. ఛార్జిషీట్లు తక్కువ

హైదరాబాద్‌లో 2023తో పోలిస్తే 2024లో మొత్తం నేరాల సంఖ్య 21.54 శాతం పెరిగింది. 2023లో 21,774 కేసులు నమోదవగా.. 2024లో అవి 27,031కు చేరాయి. దేశంలోని 19 ప్రధాన నగరాల్లో హైదరాబాద్‌ ఐదో స్థానంలో నిలిచింది. అయితే కేసులు భారీగా నమోదవుతున్నప్పటికీ.. దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్లు దాఖలు చేయడంలో మాత్రం పోలీసులు వెనుకబడినట్లు నివేదిక తెలిపింది. నమోదైన కేసుల్లో కేవలం 56.9 శాతం కేసులకే ఛార్జిషీట్లు దాఖలు కావడం ఆందోళన కలిగిస్తోంది.

మహిళలు, చిన్నారులపై వేధింపులు

రాజధానిలో మహిళలు, చిన్నారులు బహిరంగ ప్రదేశాలు, ప్రజారవాణా వ్యవస్థల్లోనే అధికంగా వేధింపులకు గురవుతున్నట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడించింది. 2024లో నమోదైన 149 లైంగిక వేధింపుల కేసుల్లో 77 కేసులు బహిరంగ ప్రదేశాలు, బస్సులు, కార్యాలయాల్లో జరిగినవేనని పేర్కొంది. అదే ఏడాది హైదరాబాద్‌లో 358 అత్యాచార కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా దిల్లీ మొదటి స్థానంలో ఉండగా.. హైదరాబాద్‌ కూడా ఆందోళనకర స్థాయిలో కేసులతో ముందువరుసలో నిలిచింది.

వదంతులు, తప్పుడు వార్తల్లో తొలి స్థానం

సోషల్‌ మీడియా వేదికగా వదంతులు, తప్పుడు వార్తల వ్యాప్తిలో హైదరాబాద్‌ దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం మరో ఆందోళనకర అంశంగా మారింది. 2024లో ఇలాంటి 68 కేసులు నమోదయ్యాయి. అలాగే ఫోర్జరీ, మోసం, నమ్మకద్రోహం కేసుల్లో 5,679 కేసులతో హైదరాబాద్‌ దేశంలో రెండో స్థానంలో ఉంది.

దొంగతనాల్లోనూ పెరుగుదల

నగరంలో 2024లో మొత్తం 4,875 దొంగతనాల కేసులు నమోదయ్యాయి. వీటిలో 2,234 వాహనాల చోరీలకు సంబంధించినవే. బందిపోటు తరహా దొంగతనాలు బెంగళూరుకు తర్వాత హైదరాబాద్‌లోనే అధికంగా నమోదవుతున్నాయని నివేదిక పేర్కొంది.

ఈ గణాంకాలు రాజధానిలో పెరుగుతున్న నేర పరిస్థితులను స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. కుటుంబ విలువలు, పర్యవేక్షణ, డిజిటల్‌ అవగాహన, పోలీసు వ్యవస్థలో వేగవంతమైన దర్యాప్తు వంటి అంశాలపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: BreakingNewsCapitalCityCrimeNewsCrimeUpdateCyberAlertCyberCrimeCyberFraudCyberSafetyDigitalFraudInternetSafetyLatestNewsOnlineScamPublicAwarenessPublicConcernshivasakthimediaTechCrime
ShareTweetSend
Previous Post

ఈరోజు బంగారం – వెండి ధరలు(08-05-2026)

Next Post

ఏపీని ఏరోస్పేస్‌, డ్రోన్ హబ్‌గా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం

Related Posts

వార్మప్‌ మ్యాచ్‌లో బౌలర్ల తడబాటు.. శ్రీలంక XI భారీ స్కోరు
Sports News

వార్మప్‌ మ్యాచ్‌లో బౌలర్ల తడబాటు.. శ్రీలంక XI భారీ స్కోరు

August 7, 2026
అమెరికాలో జన్మతః పౌరసత్వంపై ట్రంప్‌ కొత్త ఆదేశాలు
World News

అమెరికాలో జన్మతః పౌరసత్వంపై ట్రంప్‌ కొత్త ఆదేశాలు

August 7, 2026
చేనేత కళకు గుర్తింపు.. రాజోలి నేతన్నకు రాష్ట్ర పురస్కారం
Telangana News

చేనేత కళకు గుర్తింపు.. రాజోలి నేతన్నకు రాష్ట్ర పురస్కారం

August 7, 2026
మద్యం మత్తు.. వేగంగా కారు నడిపి ఇద్దరు వైద్య విద్యార్థులపైకి
Crime News

మద్యం మత్తు.. వేగంగా కారు నడిపి ఇద్దరు వైద్య విద్యార్థులపైకి

August 7, 2026
నోటీసు బోర్డు నుంచి వెబ్‌సైట్‌ వరకు.. స్కూళ్లలో ఫీజుల వివరాలు తప్పనిసరి
Telangana News

నోటీసు బోర్డు నుంచి వెబ్‌సైట్‌ వరకు.. స్కూళ్లలో ఫీజుల వివరాలు తప్పనిసరి

August 7, 2026
ప్రారంభమైన సౌత్ జోన్ హ్యాండ్ బాల్ పోటీలు
News

2500 మంది క్రీడాకారులతో సౌత్‌ జోన్‌ హ్యాండ్‌బాల్‌ పోటీలు

August 7, 2026
Next Post
ఏపీని ఏరోస్పేస్‌, డ్రోన్ హబ్‌గా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం

ఏపీని ఏరోస్పేస్‌, డ్రోన్ హబ్‌గా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 7, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 7, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
వార్మప్‌ మ్యాచ్‌లో బౌలర్ల తడబాటు.. శ్రీలంక XI భారీ స్కోరు

వార్మప్‌ మ్యాచ్‌లో బౌలర్ల తడబాటు.. శ్రీలంక XI భారీ స్కోరు

August 7, 2026
అమెరికాలో జన్మతః పౌరసత్వంపై ట్రంప్‌ కొత్త ఆదేశాలు

అమెరికాలో జన్మతః పౌరసత్వంపై ట్రంప్‌ కొత్త ఆదేశాలు

August 7, 2026
చేనేత కళకు గుర్తింపు.. రాజోలి నేతన్నకు రాష్ట్ర పురస్కారం

చేనేత కళకు గుర్తింపు.. రాజోలి నేతన్నకు రాష్ట్ర పురస్కారం

August 7, 2026
మద్యం మత్తు.. వేగంగా కారు నడిపి ఇద్దరు వైద్య విద్యార్థులపైకి

మద్యం మత్తు.. వేగంగా కారు నడిపి ఇద్దరు వైద్య విద్యార్థులపైకి

August 7, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

వార్మప్‌ మ్యాచ్‌లో బౌలర్ల తడబాటు.. శ్రీలంక XI భారీ స్కోరు

వార్మప్‌ మ్యాచ్‌లో బౌలర్ల తడబాటు.. శ్రీలంక XI భారీ స్కోరు

August 7, 2026
అమెరికాలో జన్మతః పౌరసత్వంపై ట్రంప్‌ కొత్త ఆదేశాలు

అమెరికాలో జన్మతః పౌరసత్వంపై ట్రంప్‌ కొత్త ఆదేశాలు

August 7, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.