దేశ అభివృద్ధిని అడ్డుకునేందుకు తప్పుడు కథనాలు సృష్టించి, వాటిని భారత్‌తో పాటు విదేశాల్లోనూ ప్రచారం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్ ఎదుగుదలను కొందరు కోరుకోవడం లేదని, అందుకోసం తప్పుడు కథనాలు, అసత్య నివేదికలు, దుష్ప్రచారాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు అనేక వ్యూహాలు అమలు చేస్తున్నారని అన్నారు. భారత్ అభివృద్ధి కేవలం దేశానికే కాకుండా ప్రపంచానికి కూడా అవసరమని ఆయన పేర్కొన్నారు.
భారత చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, కానీ మన దేశ చరిత్ర బానిస చరిత్ర కాదని మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. ఆక్రమణదారులపై పోరాటాల చరిత్రగా భారత చరిత్ర నిలుస్తుందని ఆయన అన్నారు.
సామాజిక, సాంస్కృతిక బానిసత్వాన్ని భారత్ ఎప్పుడూ అంగీకరించలేదని, ఎన్నో కష్టాలు వచ్చినా ధర్మం, సంస్కృతి వీడలేదని ఆయన తెలిపారు. మహారాణా ప్రతాప్ పోరాటం ధర్మం, సంస్కృతి, స్వాభిమానం కోసం సాగిందని ఆయన పేర్కొన్నారు.
ఆయన జీవితంపై లోతైన అధ్యయనం అవసరమని, ఆయన స్ఫూర్తితో దేశం మరింత దృఢంగా ఎదగాలని మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు. వైవిధ్యంలో ఏకత్వం భారత బలమని, పరస్పర గౌరవం, సామరస్యం అత్యంత ముఖ్యమని ఆయన అన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















