ఇండియన్ నేవీ అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ మ్యూజీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి అర్హతతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వాద్య పరికరాల్లో ప్రావీణ్యం ఉన్న పురుషులు, మహిళలు ఇద్దరూ అర్హులే.ఇది 2026(2) ఇంటేక్‌కు సంబంధించిన నోటిఫికేషన్. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఎంపికైనవారికి శిక్షణ అనంతరం నేవీ బ్యాండ్ విభాగంలో సేవ చేసే అవకాశం ఉంటుంది. శిక్షణ ఐఎన్‌ఎస్ చిలకలో ప్రారంభమవుతుంది.
ఎంపిక ప్రక్రియలో ముందుగా పదో తరగతి మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. తరువాత సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (PFT), రాత పరీక్ష, మ్యూజిక్ ఎబిలిటీ టెస్ట్ నిర్వహిస్తారు.
PFTలో 1.6 కి.మీ పరుగుతో పాటు స్క్వాట్స్, పుష్-అప్స్, సిట్-అప్స్ పరీక్షలు ఉంటాయి. రాత పరీక్షలో సైన్స్, మ్యాథ్స్, జనరల్ అవేర్‌నెస్ నుంచి 10వ తరగతి స్థాయి ప్రశ్నలు అడుగుతారు.వేతనం మొదటి ఏడాది నెలకు రూ.30,000 నుండి ప్రారంభమై నాలుగో ఏడాదికి రూ.40,000 వరకు ఉంటుంది. నాలుగేళ్ల సేవ తర్వాత సేవా నిధి, సర్టిఫికెట్ లాంటి ప్రయోజనాలు అందుతాయి. ఎంపికైనవారిలో 25% మందికి శాశ్వత నేవీ ఉద్యోగ అవకాశం ఉంటుంది.
దరఖాస్తు గడువు: 26.04.2026
వెబ్‌సైట్: joinindiannavy.gov.in
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















