నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు వందలాది కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. జలప్రళయం కారణంగా ఇప్పటివరకు వందల మంది మృతిచెందగా.. వేలాది మంది గల్లంతయ్యారు. ఈ విషాద సమయంలో ఓ తల్లికి ఎదురైన అనుభవం ఇప్పుడు అందరి కళ్లను చెమ్మగిల్లేలా చేస్తోంది.
రాసువా జిల్లాకు చెందిన మట్టి మాయా తమాంగ్ (28) తన ఇద్దరు కుమారులు వరదల్లో కొట్టుకుపోయారని భావించి కన్నీరుమున్నీరుగా విలపించింది. బుధవారం ఉదయం తన పిల్లలు పాఠశాలకు వెళ్లిన కొద్దిసేపటికే భారీ శబ్దాలు వినిపించాయి. బయటకు వచ్చి చూడగా వరద నీరు, బురద, రాళ్లు వేగంగా ప్రవహిస్తూ భయానక పరిస్థితి కనిపించింది.
వరద ఉద్ధృతికి పాఠశాల భవనం కూడా దెబ్బతింది. తన కుమారులు కూడా అందులో చిక్కుకుని ఉంటారని భావించిన తమాంగ్.. సహాయక శిబిరాలు, పరిసర ప్రాంతాల్లో రోజుల తరబడి వెతికింది. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో వారు ఇక లేరని భావించింది.
అయితే పెద్ద కుమారుడు జోయల్ ఘలే (8) అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డాడు. వరదలు వచ్చిన సమయంలో ఓ స్నేహితుడితో కలిసి పాఠశాల నుంచి బయటకు పరుగెత్తి అడవిలోకి వెళ్లాడు. వరద నీటి నుంచి తప్పించుకునేందుకు చెట్టు ఎక్కినా.. ఈ క్రమంలో కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. చేతులు, ముఖంపై కూడా గాయాలయ్యాయి.
పోలీసులు గురువారం బాలుడిని గుర్తించి నువాకోట్ జిల్లాలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖాఠ్మాండూకు తరలించారు. ఓ జర్నలిస్టు సాయంతో జోయల్ ఆచూకీ తెలుసుకున్న తమాంగ్ ఆస్పత్రికి చేరుకుంది.
కుమారుడిని చూసే వరకు అతడు బతికే ఉన్నాడని నమ్మలేకపోయిన తల్లి.. ఒక్కసారిగా అతడిని చూసి భావోద్వేగానికి గురైంది. ఇదే సమయంలో చిన్న కుమారుడు కూడా సురక్షితంగా దొరకడంతో ఆ కుటుంబంలో విషాదం స్థానంలో ఆనందం నెలకొంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















