నేపాల్: రెండ్రోజుల క్రితం వరకు వినియోగదారులు, పర్యాటకులతో సందడిగా కనిపించిన నేపాల్‌లోని త్రిశూలీ బజార్ ఇప్పుడు బురద, శిథిలాల దిబ్బగా మారిపోయింది. బుధవారం అకస్మాత్తుగా వచ్చిన వరదల ఉద్ధృతికి ఈ ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. తాజాగా అక్కడి విధ్వంసానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతున్నాయి.
నగలు, వస్త్ర దుకాణాలు, ఇతర వ్యాపార సముదాయాలతో ఎప్పుడూ కళకళలాడే త్రిశూలీ బజార్.. వరదల అనంతరం పూర్తిగా మారిపోయింది. భారీగా తరలివచ్చిన వరద నీరు, బురద, శిథిలాలు ప్రాంతాన్ని ముంచెత్తాయి. పలు దుకాణాలు, వ్యాపార సముదాయాల ఆనవాళ్లు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది.
త్రిశూలీ బజార్ వైపు వరద నీరు వేగంగా దూసుకొస్తున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. భారీగా ప్రవహించిన నీటితో పాటు బురద, శిథిలాలు ఒక్కసారిగా ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఈ పరిణామంతో అక్కడ ఉన్న ప్రజలు ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాల వైపు పరుగులు తీశారు.
కొద్ది సమయం క్రితం వరకు జనసందడితో కనిపించిన ప్రాంతం.. వరద అనంతరం బురదమయంగా మారిన తీరు స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రకృతి విపత్తు ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో ఈ వీడియోలు స్పష్టంగా చూపిస్తున్నాయి.త్రిశూలీ బజార్‌లో జరిగిన నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు, ప్రాణనష్టం, ఆస్తి నష్టంపై అధికారిక సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















