రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈలు) ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక ప్రోత్సాహక అధికారిని నియమించనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
మంగళగిరిలోని ఏపీఐఐసీ టవర్స్‌లో పరిశ్రమలశాఖ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ అధికారులు నియోజకవర్గ విజన్ ప్లాన్ అమలులో పరిశ్రమలశాఖ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ పని చేస్తారని చెప్పారు.
‘ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త’ను తయారు చేయడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ, ఎంఎస్‌ఎంఈలను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగే ఇండస్ట్రియల్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కమిటీ ద్వారా సరైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
అలాగే, సీఎం ఎంటర్‌ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్, ఏపీ క్లస్టర్ డెవలప్‌మెంట్ వంటి పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎంఎస్‌ఎంఈలకు రావాల్సిన బకాయిలు ఆలస్యమైతే వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















