నూహ్‌లో సైబర్ నేరాల విస్తరణ ఒక్కరోజులో జరగలేదు. అయిదారేళ్ల క్రితం వరకు ఈ ప్రాంతానికి చెందిన నేరగాళ్లు ఏటీఎంలు, వాహనాలు, సెల్‌ఫోన్ల చోరీలు, నకిలీ బంగారం విక్రయాలు వంటి నేరాలకు పాల్పడేవారు. కరోనా సమయంలో పరిస్థితులు మారడంతో సైబర్ నేరాల వైపు మళ్లారు. సమీపంలోని భరత్‌పుర్ ప్రాంతానికి చెందిన ముఠాల నుంచి ఆన్‌లైన్ మోసాలపై మెలకువలు నేర్చుకున్నట్లు అధికారులు గుర్తించారు.
ఆ తర్వాత చిన్నచిన్న గుంపులుగా ఏర్పడిన నేరగాళ్లు వివిధ రకాల ఆన్‌లైన్ మోసాలకు పాల్పడ్డారు. మోసపూరిత ప్రకటనలు, నకిలీ ఆఫర్లు, సెక్స్‌టార్షన్ వంటి పద్ధతులను ఎంచుకున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా, వాట్సప్ ద్వారా పరిచయాలు పెంచుకుని బాధితులను బ్లాక్‌మెయిల్ చేయడం ద్వారా డబ్బులు వసూలు చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
నూహ్‌లో సైబర్ నేరాల తీవ్రతను గుర్తించిన పోలీసులు 2023 ఏప్రిల్ 27న భారీ స్థాయిలో దాడులు చేపట్టారు. 102 పోలీసు బృందాలు 14 గ్రామాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌లో 125 మంది నిందితులను అరెస్టు చేశారు. ఒక సైబర్ నేరాల హాట్‌స్పాట్‌పై దేశంలోనే ఇంత భారీ స్థాయిలో పోలీసులు దాడులు నిర్వహించడం అప్పట్లో ప్రత్యేకంగా నిలిచింది.
దేశవ్యాప్తంగా నమోదైన సైబర్ నేరాలను విశ్లేషించగా నూహ్ ప్రాంతానికి చెందిన ముఠాలపై వేల సంఖ్యలో కేసులు ఉన్నట్లు గుర్తించారు. సుమారు 28 వేల సైబర్ నేరాల ద్వారా ఈ ముఠాలు రూ.100 కోట్లకుపైగా కొల్లగొట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ ముఠాలకు అత్యధికంగా బాధితులు ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉండగా.. తెలంగాణ కూడా ప్రభావిత రాష్ట్రాల జాబితాలో ముందంజలో ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
సైబర్ నేరాల మూలాలను వేగంగా గుర్తించేందుకు ఇండియన్ సైబర్‌క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్ ‘ప్రతిబింబ్’ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సైబర్ మోసాల సమయంలో ఉపయోగించిన ఐపీ అడ్రస్‌లు, ఇతర సాంకేతిక వివరాల ఆధారంగా నేరగాళ్లు ఏ ప్రాంతం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారో గుర్తించే ప్రయత్నం చేస్తారు. గుర్తించిన ప్రాంతాలను జీఐఎస్ మ్యాప్‌పై హాట్‌స్పాట్లుగా నమోదు చేస్తారు.
‘ప్రతిబింబ్’లో నమోదైన సైబర్ నేరాల హాట్‌స్పాట్లలో ఎక్కువ భాగం ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. నూహ్ అగ్రస్థానంలో ఉండగా.. ఒకప్పుడు సైబర్ నేరాలకు మారుపేరుగా నిలిచిన జామ్‌తారా పదో స్థానానికి పడిపోయింది. మరోవైపు తెలంగాణలో ఇలాంటి హాట్‌స్పాట్ ఒక్కటీ నమోదు కాకపోవడం రాష్ట్రానికి సానుకూల అంశంగా చెప్పవచ్చు.
పోలీసుల వరుస దాడులు, నిందితుల అరెస్టులు, సైబర్ నేరాలపై అవగాహన పెరగడంతో నూహ్‌లో నేరాల తీవ్రత కొంతమేర తగ్గినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. అయితే దేశంలో అత్యధిక సైబర్ నేరాల హాట్‌స్పాట్‌గా నూహ్ కొనసాగుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















