పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పుట్టినరోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తున్న 15 మంది కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న ఆటోను ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఏడుగురు మృతిచెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో వృద్ధులు, మహిళలు ఉండగా.. గాయపడిన వారిలో నలుగురు చిన్నారులు ఉన్నారు.
అర్ధరాత్రి సమయంలో జాతీయ రహదారిపై అడ్డరోడ్డు వద్ద ఆటో మలుపు తిరుగుతున్న సమయంలో వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ఆటో నుజ్జునుజ్జయింది. సంఘటనా స్థలంలోనే నలుగురు మృతి చెందగా.. ఆసుపత్రులకు తరలించిన తర్వాత మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
మృతులంతా చిలకలూరిపేట మండలం వేలూరు ఎస్సీ కాలనీకి చెందిన సమీప బంధువులు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే కుటుంబాల్లో ఒకేసారి ఏడుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
సమాచారం అందుకున్న పోలీసులు, 108 సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేటు ఆసుపత్రులు, గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.
ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ ప్రైవేటు వాహనాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని సూచించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















