రూ.22,569 కోట్ల భారీ ఐపీఓతో మార్కెట్లోకి అడుగుపెట్టిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) తొలి రోజే పెట్టుబడిదారులకు లాభాలను అందించింది. రూ.1,785 ఇష్యూ ధరతో పోలిస్తే బీఎస్‌ఈలో రూ.1,800 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన షేరు.. ఒక దశలో 5.21 శాతం పెరిగి రూ.1,878ను తాకింది. చివరకు 1.85 శాతం లాభంతో రూ.1,818 వద్ద ముగిసింది.
తొలి రోజు ముగిసే సమయానికి ఎన్‌ఎస్‌ఈ మార్కెట్ విలువ రూ.4,49,955 కోట్లకు చేరింది. దీంతో దేశంలో మార్కెట్ విలువ పరంగా అత్యంత విలువైన కంపెనీల జాబితాలో 11వ స్థానంలో నిలిచింది. ఒక దశలో టాప్-10లోకి కూడా ప్రవేశించింది. రూ.4,44,586 కోట్ల మార్కెట్ విలువ ఉన్న సన్‌ఫార్మాను ఎన్‌ఎస్‌ఈ అధిగమించింది.
రూ.22,569 కోట్ల సమీకరణతో 2024లో వచ్చిన హ్యుందాయ్ మోటార్ ఇండియా రూ.27,870 కోట్ల ఐపీఓ తర్వాత దేశంలో రెండో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా ఎన్‌ఎస్‌ఈ నిలిచింది. దీంతో రూ.21,000 కోట్ల ఎల్‌ఐసీ ఐపీఓను కూడా అధిగమించింది.
1992లో ఏర్పాటైన ఎన్‌ఎస్‌ఈకి 1993 ఏప్రిల్‌లో సెబీ నుంచి స్టాక్ ఎక్స్ఛేంజీగా గుర్తింపు లభించింది. 1994లో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ సంస్థ.. ప్రస్తుతం దేశీయ క్యాపిటల్ మార్కెట్లో కీలక పాత్ర పోషిస్తోంది.
మరోవైపు, ప్రపంచంలోని అత్యంత విలువైన స్టాక్ ఎక్స్ఛేంజీల్లోనూ ఎన్‌ఎస్‌ఈ స్థానం సంపాదించింది. సుమారు 46.87 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో ప్రపంచంలో 7వ అత్యంత విలువైన స్టాక్ ఎక్స్ఛేంజీగా నిలిచింది. సీఎంఈ గ్రూప్, ఇంటర్‌కాంటినెంటల్ ఎక్స్ఛేంజీ, హాంకాంగ్ ఎక్స్ఛేంజ్, డాయిష్ బోర్సే, నాస్‌డాక్, లండన్ స్టాక్ ఎక్స్ఛేంజీల తర్వాత ఎన్‌ఎస్‌ఈ ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















