స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. రిటైర్మెంట్‌ను పక్కనబెట్టి 2028 ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న ఆమె, తన రీఎంట్రీని ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
ఆసియా గేమ్స్, వరల్డ్ ఛాంపియన్‌షిప్ ట్రయల్స్‌కు అర్హత సాధించేందుకు కీలకమైన నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌లో పాల్గొనాలని భావించినప్పటికీ, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. గడువు ముగియకముందే ‘డెడ్‌లైన్ పూర్తైంది’ అనే సందేశం రావడం ఆశ్చర్యకరమని పేర్కొన్నారు.
ఈ విషయంపై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించినా స్పందన లభించలేదని వినేశ్ తెలిపారు. ఫెడరేషన్ కప్‌లో కూడా చివరి నిమిషంలో ఎంపిక ప్రమాణాలు మార్చడంతో పోటీలో పాల్గొనే అవకాశం కోల్పోయినట్లు చెప్పారు.
అయితే ఈ ఆరోపణలను WFI చీఫ్ సంజయ్ సింగ్ ఖండించారు. పలువురు రెజ్లర్లకు ఇలాంటి సాంకేతిక సమస్యలు వచ్చినప్పటికీ, వారు సంబంధిత అధికారులను సంప్రదించి పరిష్కరించుకున్నారని తెలిపారు. ఎవరినీ ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం జరగదని, అన్ని టోర్నమెంట్లు అందరికీ అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















