భారత్ వేదికగా తొలిసారి జరుగుతున్న ప్రపంచ పారా ఆర్చరీ సిరీస్‌లో భారత ఆర్చర్లు సత్తా చాటుతున్నారు. స్టార్ అథ్లెట్, కాంపౌండ్ పారా ప్రపంచ ఛాంపియన్ శీతల్ దేవి అంచనాలకు తగ్గ ప్రదర్శన చేస్తూ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో స్వదేశానికి చెందిన సరితను 145-143 తేడాతో ఓడించి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో కజకిస్థాన్‌కు చెందిన ఐజాదా సీడన్‌తో శీతల్ తలపడనుంది.
సెమీఫైనల్లో ఓటమి ఎదుర్కొన్న సరిత కాంస్య పతకం కోసం చైనాకు చెందిన వాంగ్ హ్యుటింగ్‌తో పోటీ పడనుంది. ఇదే సమయంలో పలు విభాగాల్లో భారత ఆర్చర్లు పతక పోరుకు అర్హత సాధించి దేశానికి మరిన్ని పతకాలు ఖాయం చేశారు.
డబ్ల్యూ-1 మహిళల విభాగంలో భారత ఆర్చర్ తన్వి ప్రవీణ్ రజత పతకం సాధించింది. ఫైనల్లో ఆమె 4-6తో సైప్రస్‌కు చెందిన క్రిస్టోస్ మిసోస్ చేతిలో ఓటమి పాలైంది. మరోవైపు డబ్ల్యూ-1 పురుషుల విభాగంలో యుగళ్ గార్గ్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. కాంస్య పతక పోరులో అతను స్వదేశానికి చెందిన పవన్ కుమార్‌పై విజయం సాధించాడు.
డబ్ల్యూ-1 మహిళల విభాగంలో స్వాతి చౌదరి కూడా కాంస్య పతకం కోసం బరిలో నిలిచింది. సెమీఫైనల్లో ఆమె 1-7తో చైనాకు చెందిన లియు జింగ్ చేతిలో పరాజయం పాలైంది.
పురుషుల రికర్వ్ విభాగంలో హర్విందర్ సింగ్, విజయ్ సుండి జోడీ ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్లో ఈ భారత జంట 5-1తో చైనాకు చెందిన జియా లీ-జు వెంజాన్ జోడీని ఓడించింది.
మహిళల రికర్వ్‌లో భావన-పూజ జోడీ కూడా స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. సెమీఫైనల్లో 6-2తో ఇరాన్ జోడీని ఓడించి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో భావన-హర్విందర్ జంట 6-0తో ఇండోనేసియా జోడీపై విజయం సాధించి ఫైనల్‌లోకి ప్రవేశించింది
పురుషుల కాంపౌండ్ విభాగంలో శ్యామ్ సుందర్-తోమన్ కుమార్ జోడీ ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్లో ఈ భారత జంట 154-153తో చైనాకు చెందిన బవో యిరుయ్-ఫెంగ్ యూ జోడీపై ఉత్కంఠభరిత విజయం సాధించింది.
మహిళల కాంపౌండ్ జోడీ విభాగంలో శీతల్ దేవి-పాయల్ నాగ్ జంట సెమీఫైనల్లో ఓటమి పాలైంది. దీంతో ఈ జంట కాంస్య పతకం కోసం పోటీ పడనుంది.
పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో ప్రపంచ ఛాంపియన్ తమన్ కుమార్ సెమీఫైనల్లో 144-146తో ఇండోనేసియాకు చెందిన కెన్ స్వాగుమిలాంగ్ చేతిలో ఓడిపోయాడు. దీంతో అతను కూడా కాంస్య పతకం కోసం బరిలోకి దిగనున్నాడు. మరో భారత కాంపౌండ్ ఆర్చర్ గుర్విందర్ సింగ్ క్వార్టర్‌ఫైనల్లో 141-143తో స్వాగుమిలాంగ్ చేతిలో పరాజయం పాలై పతక రేసు నుంచి నిష్క్రమించాడు.
డబ్ల్యూ-1 పురుషుల విభాగంలో భారత ఆర్చర్లు అడిల్ నజీర్, నూరుద్దీన్ క్వార్టర్‌ఫైనల్లోనే ఓటమి పాలయ్యారు. మొత్తంగా పలు విభాగాల్లో భారత ఆర్చర్లు ఫైనల్స్, కాంస్య పతక పోరులకు చేరుకోవడంతో ప్రపంచ పారా ఆర్చరీ సిరీస్‌లో భారత్ పతకాలపై భారీ ఆశలు పెట్టుకుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















