ఇండస్ట్రీలో త్రిష లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని నటి మాళవిక మోహనన్ అన్నారు. కొత్తగా పరిశ్రమలోకి వచ్చిన వారిని కూడా ఆమె ఎంతో ప్రోత్సహిస్తారని తెలిపారు. ‘సర్దార్ 2’ ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాళవిక.. త్రిషతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘పేట’ చిత్రంలో త్రిషతో కలిసి పనిచేసిన విషయాన్ని మాళవిక గుర్తుచేసుకున్నారు. పరిశ్రమలోకి కొత్తగా వచ్చిన సమయంలోనే ‘పేట’లో అవకాశం వచ్చిందని, వారణాసిలో జరిగిన షూటింగ్‌లో త్రిషతో కలిసి కొన్ని సన్నివేశాల్లో నటించానని చెప్పారు. ఆ సమయంలోనే త్రిష తనను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారని తెలిపారు.
‘‘నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ‘పేట’ అవకాశం వచ్చింది. రజనీకాంత్ సినిమా కావడంతో చాలా ఆనందించా. అయితే కమర్షియల్ సినిమా చేసిన అనుభవం లేకపోవడంతో కాస్త కంగారుపడ్డా. వారణాసి షూటింగ్ సమయంలో త్రిషతో కలిసి కొన్ని కాంబినేషన్ సీన్లలో నటించా. అప్పుడే మా మధ్య పరిచయం ఏర్పడింది. ఆమె నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. ప్రతి విషయంలోనూ నన్ను భాగం చేసేవారు’’ అని మాళవిక తెలిపారు.
పరిశ్రమలో చాలామంది తమ పని తాము చేసుకుని వెళ్లిపోతారని, అయితే త్రిష మాత్రం కొత్తవారిపైనా ఎంతో ఆదరణ చూపిస్తారని ఆమె అన్నారు.
ఆ తర్వాత విజయ్ సరసన ‘మాస్టర్’ సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పుడు త్రిష తనకు ప్రత్యేకంగా మెసేజ్ పంపారని మాళవిక వెల్లడించారు. ‘‘బేబీ.. నీకు ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని త్రిష మెసేజ్ చేశారని తెలిపారు.
తనను అలా అభినందించడానికి ఎంతో పెద్ద మనసు ఉండాలని మాళవిక అన్నారు. కెరీర్ కీలక దశలో త్రిష ఇచ్చిన ప్రోత్సాహం తనకు ఎప్పటికీ ప్రత్యేకమేనని చెప్పారు.
2021లో విడుదలైన ‘మాస్టర్’ మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక మాళవిక మోహనన్ నటించిన ‘సర్దార్ 2’ సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















