హనుమకొండకు చెందిన పవన్ కల్యాణ్ వీరాభిమాని పొనుగంటి నిరంజన్ (17) మృతి చెందడం అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ, ఎదుగుదల లోపంతో చిన్న వయసులోనే మంచానికే పరిమితమైన నిరంజన్‌ను గత నెలలో పవన్ కల్యాణ్ స్వయంగా పరామర్శించారు.
నిరంజన్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న పవన్ అతడిని ఆత్మీయంగా పలకరించి ధైర్యం చెప్పారు. కాసేపు మాట్లాడి, సెల్ఫీ తీసుకుని, తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. తన అభిమాన హీరోను కలవడం నిరంజన్‌కు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఆ సమయంలో తన కోరికలను పవన్‌తో పంచుకున్నాడు.
తనకు ఓ కుక్కపిల్లను పెంచుకోవాలని ఉందని నిరంజన్ చెప్పగా.. పవన్ కల్యాణ్ తప్పకుండా పంపిస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు కుక్కపిల్లను కూడా అందించారు. అలాగే భవిష్యత్తులో ‘ఓజీ 2’ సినిమా వస్తే అందులో నువ్వే నా స్పెషల్ గెస్ట్ అంటూ పవన్ చెప్పడంతో నిరంజన్ ఎంతో సంతోషించాడు. తన అభిమాన నటుడితో కలిసి సినిమా చూడాలనే అతడి కోరిక మాత్రం తీరకుండానే విషాదం చోటుచేసుకుంది.
ఇటీవల నిరంజన్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో తల్లిదండ్రులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి అతడు తుదిశ్వాస విడిచాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
నిరంజన్ మృతి విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పవన్‌తో నిరంజన్ గడిపిన క్షణాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అభిమానులు పంచుకుంటూ అతడికి నివాళులు అర్పిస్తున్నారు.
మరోవైపు ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ కూడా నిరంజన్ కుటుంబ సభ్యులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. నిరంజన్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అవసరమైన సహాయం అందించేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని భరోసా ఇచ్చారు.
అభిమాన నటుడిని కలుసుకుని జీవితంలో మధురమైన క్షణాలను పొందిన నిరంజన్.. తన కలలు పూర్తిగా నెరవేరకముందే కన్నుమూయడం అభిమానులను కలచివేస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















