హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికలు రూపొందిస్తోందని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఎల్‌బీనగర్-హయత్‌నగర్ మార్గంలో ప్రతిపాదించిన డబుల్ డెక్కర్ పైవంతెనకు త్వరలో టెండర్లు పిలుస్తామని, ఏడాదిలోపు పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
రంగారెడ్డి జిల్లా తొర్రూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ఆధునిక రహదారి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. విజయవాడ వరకు చేపట్టనున్న ఆరు వరుసల రహదారి, రెండు లేన్ల సర్వీస్ రోడ్డు నిర్మాణానికి రూ.10,410 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ఈ పనులకు వచ్చే నెలలో టెండర్లు పిలవనున్నట్లు పేర్కొన్నారు.
ఇబ్రహీంపట్నం, మేడ్చల్, మల్కాజిగిరి నియోజకవర్గాల పరిధిలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) విధానంలో చేపట్టనున్న రూ.338 కోట్ల విలువైన ఆధునిక నాలుగు వరుసల రహదారి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ రహదారులు పూర్తయితే ఆయా ప్రాంతాల్లో ప్రయాణ సమయం తగ్గడంతో పాటు పారిశ్రామిక, వాణిజ్య అభివృద్ధికి ఊతమిస్తాయని తెలిపారు.
ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగంగా గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామని మంత్రి చెప్పారు. దీనికి సమాంతరంగా బుల్లెట్ రైలు మార్గం ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్ కూడా సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రవాణా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మరో మూడు రహదారుల అభివృద్ధికి రూ.100 కోట్లతో నివేదిక సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రజలకు మెరుగైన రోడ్డు సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్య, వైద్యంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో రహదారుల నిర్మాణం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఏవీఎన్ రెడ్డి, శంకర్‌నాయక్, రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి, టీయూఎఫ్‌ఐడీసీ ఛైర్మన్ చల్లా నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















